దిషా నిందితులకి ఉరిశిక్ష వేయాలి... నిరాహార దీక్షకి దిగుతున్న స్వాతి  

Dcw Chief Swati Maliwal Will Be Start Hunger Strike-justice For Disha,nirbhaya Act,start Hunger Strike

దేశంలో నిర్భయ ఘటన తర్వాత ఆ స్థాయిలో మరో సారి చర్చనీయాంశంగా మారిన ఘటన దిషా అత్యాచారం, హత్య.హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరిని కదిలించింది.ప్రతి ఒక్కరు ఈ ఘటనపై స్పందించి తమ ఆవేదనని వ్యక్తం చేయడంతో పాటు, ఆమెని అతి కిరాతకంగా అత్యాచారం చేసిన హత్య చేసిన వాళ్ళని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.పార్టీలకతీతంగా అందరూ ఈ ఘటన మీద ఒకే గొంతు వినిపిస్తున్నారు.

Dcw Chief Swati Maliwal Will Be Start Hunger Strike-justice For Disha,nirbhaya Act,start Hunger Strike Telugu Viral News Dcw Chief Swati Maliwal Will Be Start Hunger Strike-justice For Disha Nirbhaya -DCW Chief Swati Maliwal Will Be Start Hunger Strike-Justice For Disha Nirbhaya Act Strike

ఇదే సమయంలో చట్టాలలో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి ఘటనలు జరిగేటపుడు ఆధారాలతో సహా దొరికిన నిందితులకి మరో విచారణ లేకుండా నేరుగా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ స్వాతి మాలివాల్‌ దిషా ఘటన మీద కీలక నిర్ణయం తీసుకున్నారు.దేశంలో పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై స్వాతి మాలివాల్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిషా కేసులో నిందితులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.దీనిపై నిరహారదీక్షకు దిగనున్నట్లు వెల్లడించారు.మంగళవారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఉదయం 10 గంటల నుంచి నిరాహార దీక్షకు దిగుతున్నట్లుగా ఆమె ప్రకటించారు.కేంద్రం నుంచి హామీ లభించేంత వరకు దీక్ష కొనసాగిస్తానని తెలిపారు.

మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.