డీసీపీ హెచ్చరిక: ఖాళీ బాటిల్స్ లో పెట్రోల్ పోస్తే అంతే సంగతులు  

Dcp Ordered, Do Not Fill Petrol In Empty Bottles - Telugu Dcp, Dcp Ordere, Do Not Fill Petrol In Empty Bottles, Telugu Viral News Updates, Viral In Social Media, ఖాళీ బాటిల్స్ లో పెట్రోల్

పెట్రోలుబంకుల్లో ఖాళీ బాటిల్స్ లో ఫీల్ చేసి ఇవ్వొద్దు అని గతంలో ఎన్నోసార్లు అధికారులు హెచ్చరించిన విషయం విదితమే.అయినప్పటికీ ఏ పెట్రోల్ బంకు లు ఈ రూల్స్ ను పాటించకుండా వ్యవహరిస్తూ వచ్చాయి.

Dcp Ordered, Do Not Fill Petrol In Empty Bottles

అయితే ఇటీవల హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన దిశా అత్యాచారం,హత్య ఘటన నేపథ్యంలో డీసీపీ ప్రకాష్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఈమేరకు శంషాబాద్ డీసీపీ.

జోన్ పరిధిలోని అన్ని పెట్రోలు బంక్‌లకు నోటీసులను జారీ చేస్తున్నామన్నారు.అంతేకాకుండా ఖాళీ బాటిళ్లతో వచ్చే వారి పేరు, ఫోన్ నంబరు, వాహనం నంబర్లు పెట్రోలు బంక్ సిబ్బంది సేకరించుకోవాలన్నారు.

పెట్రోలు బంక్ సిబ్బంది వద్ద స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కాబట్టి ఖాళీ బాటిళ్లతో పెట్రోలు కోసం వచ్చే వారి ఫోటోను తీసుకుని పెట్టుకోవాలని డీసీపీ స్పష్టం చేశారు.

ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు దృష్ట్యా ఈ విషయాలను ప్రతి పెట్రోలు బంక్ సిబ్బంది, యాజమాన్యం పాటించాలని డీసీపీ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది.ఈ విషయమై బంక్ యజమానులు, నిర్వాహకులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఖాళీ బాటిళ్లలో పెట్రోలు పోయవద్దని తెలియజేస్తామని డీసీపీ ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు.ఇటీవల హైదరాబాద్ లో చోటుచేసుకున్న తెలంగాణా నిర్భయ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dcp Ordered, Do Not Fill Petrol In Empty Bottles-dcp Ordere,do Not Fill Petrol In Empty Bottles,telugu Viral News Updates,viral In Social Media,ఖాళీ బాటిల్స్ లో పెట్రోల్ Related....