కానిస్టేబుల్ కూతురిపై..డీసీపీ అత్యాచారం....

ఇలాంటి వార్తలు చదివినప్పుడు అత్యాచారాలు చేసే వెధవలకి కాస్త ధైర్యం వస్తుంది…ఒక ఉన్నత స్థాయి అధికారి చేయగా లేనిది మనం చేస్తే తప్పు ఏంటి అని.నేరాలు చేసేవారిని లాటీ తో కాళ్ళు విరిగేలా కొట్టి మళ్ళీ తప్పు చేయకుండా బుద్ది చెప్పే స్థాయిలో ఉన్న డీసీపీ స్థాయి పోలీసు ఉన్నత అధికారి సాటి మహిళా కానిస్టేబుల్ కూతురిపై కన్నేశాడు ఆపై ఇంతకి పిలిచి అత్యాచారం చేశాడు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

 Dcp Rape Attempt On Constable Daughter-TeluguStop.com

ఇప్పటికే దేశంలో ఎంతో మంది బరితెగించి అత్యాచారం చేస్తూ బరితెగించి పోతుంటే.ఇప్పుడు సదరు పోలీస్ బాస్ చేసిన ఘటనతో పోలీసుల పరువు మొత్తం పోయింది.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది…ఏపీఎఫ్ (ఔరంగాబాద్ పోలీస్ ఫోర్స్)లో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ కుమార్తె మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు సిద్దం అవుతోంది ఈ క్రమంలో తన వద్ద పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ కుమార్తెను చూసిన ఔరంగాబాద్ జోన్-2 డీసీపీ రాహుల్ శ్రీరామే ఆమెపై ని ఎలాయినా పొందాలని అనుకున్నాడు ఎంపీఎస్సీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలో నీ కుమార్తెకు నేను చెబుతాను…నీ కుమార్తె పాస్ అయ్యేలా చేసే భాద్యత నాది అంటూ నమ్మించి తన ఇంటికి పిలిపించుకున్నాడు

డీసీపీయే స్వయంగా కోచింగ్ ఇస్తే తన కుమార్తెకు ఉద్యోగం తప్పకుండా వస్తుందని భావించిన ఆమె తన కుమార్తెను కోచింగ్ కోసం డీసీపీ వద్దకి పంపింది…ఆ యువతిపై కన్నేసిన డీసీపీ ఆమెకు కోచింగ్ ఇచ్చే నెపంతో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.లైంగికంగా వేధించేవాడు.ఆ వేదింపులు తాళలేక ఆ యువతి ఈ విషయాన్ని తన తల్లితో చెప్పడంతో ఆమె దీసీపి పై ఉనత అధికారులకి అధికారులకు వాట్సాప్ హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసింది.కోచింగ్ ఇస్తాడని నమ్మి తన కుమార్తెను పంపిస్తే అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

దాంతో ఫిర్యాదు స్వీకరించిన అధికారులు డీసీపీ పై ఐసీపీ 376, 417,323,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.బాధిత యువతిపై డీసీపీ ఫిబ్రవరి, జూన్ నెలల్లో వరుస వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది అయితే డీసీపీ ప్రస్తుతం సెలవులో ఉన్నాడని.

ఈ కేసుని విచారణ చేస్తున్న మరో దీసేపీ వినాయక్ తెలిపారు.అయితే సెలవుల నుంచీ రాగానే అతడిపై చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అని చర్యలు తీసుకుంటామని ఉన్నత అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube