పగటి పూట శృంగారం వల్ల అబ్బాయిలు పుడతారా... ఈ విషయమై వైధ్యులు ఏమంటున్నారో తెలుసా?  

Day Time Romance Is Good For Health-good For Health,romance,పిల్లలు,శృంగారం

మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ, ఒత్తిడిలో ఉంటాడు. అలాంటి వారికి కొద్దిలో కొద్దిగా అయినా ఒత్తిడి నుండి బయట పడేసే అద్బుతమైన ఔషదం శృంగారం అనడంలో ఎలాంటి సందేహం లేదు. శృంగారం అనేది కేవలం ఒత్తిడిని దూరం చేయడానికే కాకుండా ఇద్దరి మద్య బంధాన్ని పెంచడానికి, ఇద్దరికి మద్య మరో బంధంను తీసుకు వచ్చేందుకు కూడా ఉపయోగపడుతుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

పగటి పూట శృంగారం వల్ల అబ్బాయిలు పుడతారా... ఈ విషయమై వైధ్యులు ఏమంటున్నారో తెలుసా?-Day Time Romance Is Good For Health

ఈ సృష్టి ఇంతటితో ఆగిపోకుండా ఉండేందుకు ఆడ మగ శృంగారం చూస్తుంది. శృంగారంతో పిల్లలు జన్మించి ఈ సృష్టి కంటిన్యూ అవుతూ వస్తోంది.

కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ భూమిపై మనుషుల మనుగడ కొనసాగుతోంది.

అంతటి అద్బుతమైన ఒక సృష్టి కార్యంగా శృంగారంను భావిస్తూ ఉంటారు. శృంగారం విషయంలో ఇండియాలో అనేక అపోహలు, పుకార్లు ఉన్నాయి. శృంగారం అనేది చాలా రహస్యం అంటూ అంతా భావిస్తూ ఉంటారు.

ముఖ్యంగా ఇండియన్స్‌ శృంగారం విషయంలో చాలా గోప్యతను పాటిస్తున్నారు. శృంగారంలో పాల్గొన్న వ్యక్తులు ఆ విషయాన్ని బయటకు చెప్పేందుకు ఆసక్తి చూపించరు. కాని తాజాగా ఇండియాలో ఒక విషయం తెగ ప్రచారం జరుగుతోంది.

అదే పగటి పూట శృంగారంలో పాల్గొంటే మగ పిల్లలు పుడతారట.

ఈ సిల్లీ పుకారు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఎలాంటి లాజిక్‌ లేని ఈ పుకారు గురించి వైధ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చిల్లర పుకార్లు కొందరు కావాలని సృష్టిస్తున్నారు అంటూ డాక్టర్లు అంటున్నారు.

రాత్రి సమయంలో, పగటి సమయంలో అనే తేడాలు శృంగారంలో ఉండవు అని, ఇద్దరు మనుషులు ఏ సమయంలో కలిసినా పుట్టబోయే బిడ్డ విషయంలో ఎలాంటి తేడాలు అయితే ఉండవు అంటూ డాక్టర్లు అంటున్నారు. సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ విషయంను నమ్మనక్కర్లేదు అంటూ ఈ సందర్బంగా వైధ్యులు చెప్పుకొచ్చారు..

రాత్రి పూట శృంగారంలో పాల్గొంటే అమ్మాయిలు, పగటి పూట పాల్గొంటే అబ్బాయిలు అనుకుంటే అది పెద్ద పొరపాటు అని, అదే నిజం అయితే అమ్మాయిలే ఉండరని, అందరు కూడా అబ్బాయిలనే కోరుకుంటారని వైధ్యులు అంటున్నారు.

ఇలాంటి చిల్లర పుకార్లు అస్సలు నమ్మవద్దని వైధ్యులు హెచ్చరిస్తున్నారు. డే టైంలో శృంగారం మానసిక ఉల్లాసంను ఇస్తుందనే విషయం నిజమే కాని మగ బిడ్డను ఇస్తుందనేది మాత్రం నూటికి నూరు పాళ్లు అబద్దం.