రోజంతా తాజాగా...ఆరోగ్యంగా ఉండాలంటే....

పొద్దునే నిద్ర లేవగానే కాఫీ త్రాగకుండా చినన్ చిన్న వ్యాయామాలు చేస్తే కండరాలు వదులు అవుతాయి.అలాగే చర్మం బిగుతుగా తయారవుతుంది.

 Day Time Keep  Fresh And  Healthy-TeluguStop.com

అంతేకాక రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది.

స్నానం చేసే ముందు యూకలిఫ్టస్ ఆయిల్ వాసన పీల్చితే శరీరానికి శక్తి అందుతుంది.

స్నానము చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకొనే అలవాటు ఉన్నవారు కనుబొమ్మల ఎముకలు మరియు నుదురు మీద రాసుకొని మసాజ్ చేసుకుంటే నిద్ర మూలంగా ఉబ్బిన ముఖం తాజాగా ఉంటుంది.

ఎక్కువసేపు వ్యాయామం చేయటం వలన చెమట బాగా పడుతుంది.

ఈ చెమటను తొందరగా తుడుచుకోవటం ముఖ్యం.ఒక వస్త్రంలో కొన్ని ఐస్ ముక్కలను వేసి మూట గా చుట్టి ముఖాన్ని రుద్దాలి.

ఫ్రిజ్ లో ఉంచిన గ్రీన్ టీ బ్యాగ్ లను రాత్రి పడుకొనే ముందు కాళ్లపై పెట్టుకొని పది నిముషాలు అయ్యాక తీసేయాలి.

రాత్రి పడుకొనే ముందు మంచి క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా చేసుకొనే సమయంలో దవడ ఎముకలను సున్నితంగా మసాజ్ చేయాలి.ఈ విధంగా చేయటం వలన చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది.

ఉదయాన్నే శ్వాస వ్యాయామాలు చేస్తే మెదడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube