Election Schedule : ఎల్లుండే ఎన్నికల షెడ్యూల్..!!

ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.ఈ క్రమంలో దేశంలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.

లోక్ సభ ఎన్నికలతో( Election Schedule ) పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎల్లుండి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.మొత్తం ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలను ఈసీ నిర్వహించే ఛాన్స్ ఉందని సమాచారం.

లోక్ సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.కాగా ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించారు.

ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తు చివరి అంకానికి చేరుకుంది.ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్ లో ఎన్నికల ఏర్పాట్లను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

ఎన్నికల సన్నాహాక సమీక్ష దాదాపు పూర్తి అయిన నేపథ్యంలో ఎల్లుండి ఈసీ షెడ్యూల్ ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు