116వ రోజు షర్మిల పాదయాత్ర

సూర్యాపేట జిల్లా:శ్రీనివాసపురం నైట్ క్యాంప్ నుంచి 116వ రోజు బుధవారం ఉదయం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల తన పాదయాత్రను ప్రారంభించారు.

 Day 116 Sharmila Padayatra-TeluguStop.com

శ్రీనివాసపురం నుండి అమరవరం యాతవాకిళ్ళ,యాతలకుంట,కల్మలచెర్వు సాయంత్రం 5గంటలకు చేరుకుంది.షర్మిలకి ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అమరవరం గ్రామానికి మంచినీళ్లు లేవు కానీ, గ్రామంలో మద్యం ఏరులై పారుతుందన్నారు.మంచినీళ్లు తెచ్చుకోవాలంటే కిలోమీటరు వెళ్లాలని అన్నారు.

బంగారు తెలంగాణ అని చెప్పి పోలీసుల దౌర్జన్యం టీఆర్ఎస్ లూటీలతో దొంగల రాజ్యం చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి పెద్ద దొంగ అని,ప్రశ్నిస్తే మా మీద దాడులు చేయించారని,పోలీసులను పనోళ్ళలా వాడుకున్నారని వ్యాఖ్యానించారు.

మూడు గంటలు వర్షంలో కూర్చుని న్యాయం కోసం ధర్నా చేస్తే కానీ,సర్కార్ లొంగలేదని అన్నారు.కేసీఅర్ పాలన అధ్వాన్నంగా ఉందంటే ఇందులో కాంగ్రెస్ కు,బీజేపీకి సైతం భాధ్యత ఉందన్నారు.

బహిరంగంగా ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతుంటే ప్రతిపక్షాలు ఏంచేస్తున్నాయని ప్రశ్నించారు.ప్రశ్నిస్తే అక్రమంగా ఎంతో మందిపై కేసులు పెడుతున్నారని,పోలీసులు టీఆర్ఎస్ చొక్కాలు వేసుకోండని ఉచిత సలహా ఇచ్చారు.పోలీసులు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి కాదని,మమ్మలని పాదయాత్ర ఎలా చేస్తారో చూస్తామంటూ బెదిరిస్తున్నారని,ఎలా చెయ్యనియ్యరో చూద్దామని పాదయాత్ర చేస్తున్ననని తెలిపారు.8 ఏళ్లలో కేసీఅర్ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యమని,ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా కేసీఅర్ నెరవేర్చలేదని,ప్రతి వర్గాన్ని కేసీఅర్ మోసం చేశారని, రుణమాఫీ లేదు,ఫీజు రీయింబర్స్మెంట్ లేదు,ఆరోగ్య శ్రీ లేదు,సున్నా వడ్డీకి రుణాలు లేవు,ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లవారుతుందని ప్రభుత్వ తీరును ఎండగట్టారు.ఎన్నికలప్పుడు మాత్రమే కేసీఅర్ వస్తాడు,గాడిదకు రంగు పూస్తారు,అవు అని నమ్మిస్తారు,ఎన్నికలయ్యాక మళ్ళీ మీ మొహం కూడా చూడడని,ఇలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్,ఎమ్మెల్యే సైదిరెడ్డి మనకు అవసరమా అని ప్రశ్నించారు.మీ ఓటు ఒక ఆయుధం,ఓటు తల్లి లాంటిది,చెల్లె లాంటిది,డబ్బులు ఇస్తే తీసుకోండి,ఓటు మాత్రం మీకు సేవ చేసే వారికి మాత్రమే వేయండని సూచించారు.

వైఎస్సార్ సంక్షేమం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టామని,వైఎస్సార్ పథకాలను మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తామని అన్నారు.ప్రతి పేద ఇంటికి మహిళ పేరు మీద పక్కా ఇల్లు, ఆరోగ్యశ్రీ కి పునర్ వైభవం,వృద్దులకు,వికలాంగులకు ఎంత మంది ఉంటే అందరికీ 3 వేలు కాకుండా పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube