సవాల్ విసిరిన డేవిడ్ వార్నర్... ఫుల్ ఖుషి అవుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్..!

డేవిడ్ వార్నర్‌ చేసిన పనికి టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఖుషీ అవుతున్నారు.అవును.

 David Warner Throws Down The Gauntlet Mahesh Babu Fans Getting Full Pleasure Da-TeluguStop.com

మరోసారి తన ఇమిటేషన్ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్.

ఈ వీడియోలో మహేష్‌ బాబును ఇమిటేట్ చేస్తూ. పోకిరి సినిమాలో మహేష్ గెటఫ్‌ను అచ్చుగుద్దినట్లు దించేశాడు.

అంతటితో ఆగకుండా తన అభిమానులకు ఒక సవాల్ కూడా విసిరాడు.

అదేమిటంటే.‘నేను ఎవరి వేషంలో ఉన్నానో, అలాగే అక్కడ చెప్పిన డైలాగ్ ఏ హీరోదో చెప్పాలి.నేను బెట్ వేయగలను.

మీరు ఖచ్చితంగా చెప్పలేరని’ అంటూ అక్కడ డిస్క్రిప్షన్ లో పేర్కొన్నాడు.అయితే ఇక్కడ కేవలం ఫేస్ మార్ఫింగ్‌ను మాత్రమే చూపించాడు.

డైలాగ్‌ను మాత్రం మ్యూట్ చేసేసాడు.సదరు వీడియోను చూసిన మహేశ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

మహేశ్ బాబు అంటే వార్నర్‌కు ఎనలేనంత అభిమానం అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

అక్కడ ఆ ప్రశ్నకు డేవిడ్ వార్నర్ ఫాన్స్ ఆన్సర్ ఇవ్వకపోయినా.

మహేష్ బాబు ఫాన్స్ మాత్రం గుట్టల గుట్టలుగా ఆన్సర్స్ ఇస్తున్నారు.ఇకపోతే డేవిడ్‌ వార్నర్‌ తన ఫ్యామిలీతో కలిసి ఇంతకు ముందు పలుమార్లు టిక్‌టాక్‌ వీడియోలతో అలరించిన విషయం అందరికీ తెలిసిందే.

అతడు డాన్స్ చేసిన సాంగ్స్ దాదాపుగా మన సూపర్ స్టార్ మహేష్ బాబువి కావడం గమనార్హం.ఈ క్రమంలోనే మళ్ళీ ఇలా ట్రై చేసి అందరినీ అలరించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube