ఆ హీరోపై కోపం నాపై చూపారంటున్న నటి..!

బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా వెండితెరకు పరిచయమయ్యారు సారా అలీ ఖాన్.కుటుంబం మొత్తం సినీ ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఈమె కూడా అదే అడుగుజాడల్లో ఇండస్ట్రీలోకి వచ్చారు.సైఫ్ అలీ ఖాన్ కూతురుగా వెండితెరకు పరిచయమై.తన నటన ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.‘కేదార్‌నాథ్‌’, ‘సింబా’, ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ వంటి చిత్రాలలో నటించి అందరిని ఆకట్టుకుంది.

 David Was Angry At Varun But Vented On Me Says Sara Ali Khan-TeluguStop.com

సారా అలీ ఖాన్ ప్రస్తుతం కూలి నెం.1 చిత్రంలో నటిస్తున్నారు.డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సారా అలీ ఖాన్ వరుణ్ ధావన్ తో జత కట్టారు.

ఈ సినిమాలో సారా అలీ ఖాన్ తండ్రి పాత్రలో పరేష్‌ రావల్‌ నటించారు.ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కాబోతుంది.

 David Was Angry At Varun But Vented On Me Says Sara Ali Khan-ఆ హీరోపై కోపం నాపై చూపారంటున్న నటి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఈ చిత్ర ప్రచారంలో భాగంగా షూటింగ్ లో జరిగిన కొన్ని అనుభవాల్ని సారా అలీ ఖాన్ పంచుకున్నారు.ఈ చిత్ర నిర్మాణంలో ఓ పాట చిత్రీకరణ సమయంలో డైరెక్టర్ డేవిడ్ తనపై ఎంతో కోపం ప్రదర్శించారని తెలిపారు.కానీ ఈ కోపాన్ని హీరో వరుణ్ ధావన్ పై చూపించాల్సి ఉండగా నాపై చూపించడంతో కొంత ఇబ్బంది పడినట్టు ఆమె తెలిపారు.

అలా డేవిడ్ ధావన్ తనపై చిరాకు పడటానికి కారణం తెలుపుతూ… నాపై షార్ట్ ఉండడంతో అందుకు సిద్ధమవుతున్న, కానీ కాస్ట్యూమ్ సెలెక్ట్ చేయడానికి కొంత సమయం పట్టింది.

మరో పక్క హీరో వరుణ్ తన వ్యాన్ లో కాస్ట్యూమ్ బిజినెస్(సరదాగా) చేస్తూ కూర్చుని ఎంతసేపటికి రాకపోయేసరికి డేవిడ్ సర్ కి తనపై ఎంతో కోపం వచ్చింది.అలా హీరో వరుణ్ పై ఉన్న కోపాన్ని తనపై చూపించారని తెలిపారు.

#Sara Ali Khan #Angry #David #Varun Dawam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు