డేవిడ్ వార్నర్ కుటుంబానికి పుష్ప ఫీవర్.. తండ్రేమో శ్రీవల్లి పాట.. కూతుళ్లు సామీ సామీ అంటూ?

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన గతంలో బాహుబలి అలా వైకుంఠపురం చిత్రాలకు సంబంధించిన పాటలకు డాన్స్ వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బాగా గుర్తింపు సంపాదించుకున్నారు.

 David Warners Daughters Shaking Leg For Saami Saami Song ,david Warner, David Daughters, Saami Saami Song, Viral Video ,allu Arjun , Puspa Movie , Social Media-TeluguStop.com

ఇలా పలు చిత్రాలలో పాటలకు డాన్స్ వీడియోలు చేసిన డేవిడ్ వార్నర్ తాజాగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా మేనియా నుంచి ఈయన బయటపడలేకపోతున్నారు.పుష్ప సినిమాలోని పాటలు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాయి.

ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ సినిమాలో పాటలకు డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుష్ప సినిమాలోని శ్రీవల్లి అనే పాటకు డాన్స్ చేయడమే కాకుండా తగ్గేదే లే అనే మూమెంట్ ను కూడా ఎంతో అద్భుతంగా చేశారు.డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతోమంది ఇతని పర్ఫామెన్స్ పై ప్రశంసలు కురిపించడమే కాకుండా అల్లు అర్జున్ కూడా రిప్లై ఇచ్చారు.

 David Warners Daughters Shaking Leg For Saami Saami Song ,david Warner, David Daughters, Saami Saami Song, Viral Video ,allu Arjun , Puspa Movie , Social Media -డేవిడ్ వార్నర్ కుటుంబానికి పుష్ప ఫీవర్.. తండ్రేమో శ్రీవల్లి పాట.. కూతుళ్లు సామీ సామీ అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా డేవిడ్ వార్నర్ శ్రీవల్లి పాట ద్వారా అందరినీ సందడి చేయగా తాజాగా ఆయన కూతుళ్లు రష్మిక వేసిన రా.రా.సామీ అనే పాటకు డాన్స్ చేశారు.ఈ క్రమంలోనే ఈ వీడియోని డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.అమ్మానాన్నల కంటే ముందుగా సామీ… సామీ అనే పాటకు డాన్స్ చేయాలనుకున్నారనీ కామెంట్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఏకంగా అల్లు అర్జున్ ఈ వీడియో కి రిప్లై ఇస్తూ సో క్యూట్ అని కామెంట్ చేశారు.మొత్తానికి డేవిడ్ వార్నర్, తన కుటుంబానికి పుష్ప ఫీవర్ తగ్గలేదనే చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube