అల్లు అర్జున్ కు విషెస్ తెలిపిన డేవిడ్ వార్నర్..!  

david warner wishes allu arjun, david warner, ala vinkuntapuram lo, tollywood, social media, viral song, 450 milion - Telugu 450 Milion, Ala Vinkuntapuram Lo, David Warner, Social Media, Tollywood, Viral Song

ఈ సంవత్సరం మొదట్లో అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించిన అలా వైకుంఠపురంలో సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఆ సినిమాలోని బుట్ట బొమ్మ.

TeluguStop.com - David Warner Wishes Allu Arjun

బుట్ట బొమ్మ.అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియా వేదికగా ఎన్నో కొత్త రికార్డులను సృష్టించింది.తాజాగా ఈ పాట వ్యూస్ పరంగా 450 మిలియన్ క్లబ్ లో అడుగు పెట్టింది.

TeluguStop.com - అల్లు అర్జున్ కు విషెస్ తెలిపిన డేవిడ్ వార్నర్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు డేవిడ్ వార్నర్ తన కుటుంబ సభ్యులతో కలిసి బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులు వేసి ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు తన సహాయంగా మంచి గుర్తింపు అందించాడు.తాజాగా ఈ పాట 450 మిలియన్ వ్యూస్ సాధించిన సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ను విష్ చేశాడు.

ఇందుకు సంబంధించి తాజాగా డేవిడ్ వార్నర్ ఇంస్టాగ్రామ్ తన ఖాతా ద్వారా ఓ పోస్ట్ లో బుట్ట బొమ్మ సాంగ్ సంబంధించిన పోస్టర్ ను షేర్ చేస్తూ అందులో ‘వెల్ డన్ అల్లు అర్జున్‘ కామెంట్ పెట్టాడు.ఈ ఘటనకు సంబంధించి ఎందరో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

సంగీత దర్శకుడు థమన్ కంపోజ్ చేసిన ఈ బుట్ట బొమ్మ పాట చాలా మంది సెలబ్రెటీలు స్టెప్పులు వేసిన వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేశాడు.

ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రం కాకుండా మలయాళంలోనూ కూడా భారీ విజయాన్ని అందుకుంది.ఈ సంవత్సరం విడుదలైన సినిమాలలో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డుకు ఎక్కింది.

#David Warner #450 Milion #Viral Song #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు