ఆల్‌మిక్స్‌తో టాప్ లేపేసిన వార్నర్  

David Warner Top Lechipoddi Video Goes Viral - Telugu David Warner, Tiktok, Top Lechipoddi, Viral Video

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా పలు దేశాలు పూర్తి లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే.ఈ లాక్‌డౌన్ సమయంలో పలువురు సెలబ్రిటీలు తమ సమయాన్ని ఇంట్లోనే గడుపుతున్నారు.

 David Warner Top Lechipoddi Video Goes Viral

అయితే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మాత్రం టిక్‌టాక్ వీడియోలు చేస్తూ రెచ్చిపోతున్నాడు.కాగా టాలీవుడ్ పాటలకు ఎక్కువగా వీడియోలు చేస్తున్న వార్నర్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఇటీవల వార్నర్ వరుసగా హిట్ సాంగ్స్‌కు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ దూసుకుపోతున్నాడు.కాగా తాజాగా అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలతో సినిమాలోని సూపర్ హిట్ పాట ‘టాప్ లేచిపోద్ది’ అనే పాటకు టిక్‌టాక్ వీడియో చేశాడు.

ఆల్‌మిక్స్‌తో టాప్ లేపేసిన వార్నర్-General-Telugu-Telugu Tollywood Photo Image

తన వీడియోలను మిక్స్ చేసి ఈ పాటను పెట్టడంతో బన్నీ ఫ్యాన్స్ వార్నర్ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.ఇక వార్నర్ చేసిన ఈ వీడియో పాటతో మరోసారి వార్నర్ టిక్‌టాక్‌లో రచ్చ చేస్తున్నాడు.

కాగా వార్నర్ చేస్తున్న టిక్‌టాక్ వీడియోలు ఆయనకు మరింత మంది అభిమానులను సంపాదించి పెడుతున్నాయి.అటు బన్నీ ఫ్యాన్స్ కూడా వార్నర్ ఎక్కువ తమ అభిమాన హీరో పాటలకే చిందులేస్తుండటం సంతోషకరంగా ఉందని అంటున్నారు.

అంతేగాక వార్నర్ టిక్‌టాక్ వీడియోలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండటం నిజంగా సంతోషించే విషయం అంటున్నారు ఆయన ఫ్యాన్స్.ఏదేమైనా మరోసారి వార్నర్ వీడియోను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తుండటంతో అది వైరల్‌గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

David Warner Top Lechipoddi Video Goes Viral Related Telugu News,Photos/Pics,Images..

footer-test