ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తున్నాడు.ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా క్రికెట్ సిరీస్ లు ఏవీ లేకపోవడంతో ఫ్యామిలీతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.
ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరుపున ఆడిన వార్నర్ కి ఇండియా అన్నా ఇక్కడి కల్చర్ అన్న చాలా ఇష్టం.ఎక్కువగా ఇండియన్ కల్చర్ ని ఫాలో అవడానికి ఇష్టపడతాడు.
ఈ నేపధ్యంలో ఈ మద్యం టిక్ టాక్ లో బాలీవుడ్, సౌత్ సినిమాలకి సంబందించిన సాంగ్స్ కి టిక్ టాక్ వీడియోలు చేస్తూ వాటిని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తున్నాడు.
కొద్ది రోజుల క్రితం అల వైకుంఠపురంలో సినిమాలోని బుట్టబొమ్మ, రాములో రాములా సాంగ్స్ కి సంబంధించి టిక్ టాక్ వీడియోలు చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని వార్నర్ ఆకర్షించాడు.
వార్నర్ వీడియోలపై బన్నీ కూడా స్పందించి థాంక్స్ చెప్పాడు.అలాగే పూరీ జగన్నాథ్ అయితే పోకిరి డైలాగ్ చెప్పినందుకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని అన్నాడు.ఇక వార్నర్ తెలుగు సినిమాలపై తన ఇష్టాన్ని మరింత చూపిస్తున్నాడు.అందులో భాగంగా తాజాగా బాహుబలిలో ప్రభాస్ తరహాలో గెటప్ వేసుకొని అమరేంద్ర బాహుబలి అను నేను అంటూ డైలాగ్ చెబుతూ టిక్ టాక్ వీడియో చేశాడు.
ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.