పోకిరి డైలాగ్ తో టిక్ టాక్ చేసి డేవిడ్ వార్నర్... రోల్ ఇస్తా అన్న పూరీ

ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ ఇండియన్ కల్చర్ అన్న, ఇక్కడి వాతావరణం, సినిమాలు అన్న చాలా ఇష్టం.తన అభిమానాన్ని ప్రతి సారి ఏదో ఒక విధంగా వార్నర్ చాటుకుంటూ ఉంటాడు.

 David Warner Pokiri Dialogues, Tollywood, Puri Jagannadh, Pokiri Movie, Telugu C-TeluguStop.com

ఈ మధ్యకాలంలో టిక్ టాక్ ద్వారా డేవిడ్ వార్నర్ టాలీవుడ్ పాటలకి స్టెప్పులు వేస్తూ సందడి చేస్తున్నాడు.ఇంట్లో ఖాళీగా ఉండటంతో బ్యాట్ పక్కన పెట్టి తనలో టాలెంట్ ని బయటపెడుతున్నాడు.

ఆ మధ్య వార్నర్ అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ కి భార్యతో, కూతురుతో కలిసి డాన్స్ చేశాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

తాజాగా పోకిరి చిత్రంలో మహేశ్ బాబు హిట్ డైలాగ్ ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అనే డైలాగ్ తో వీడియో చేశాడు.ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

ఇక ఈ వీడియో చూసిన దర్శకుడు పూరీ జగన్నాథ్ వెంటనే స్పందించాడు.వార్నర్ నటన బాగుందని, తన చిత్రంలో ఓ అతిథి పాత్ర ఇస్తానంటూ ఆఫర్ చేశాడు.

పూరీ ఆఫర్ పట్ల డేవిడ్ వార్నర్ వెంటనే స్పందించాడు. నేను కూడా ప్రయత్నిస్తున్నాను సర్.అయితే, సన్ రైజర్స్ ఫ్రాంచైజీ నన్ను వదులుకుంటుందో లేదో చూడాలి.లేకపోతే సన్ రైజర్స్ నుంచి నన్ను విడిపించేందుకు మీరే ఏదైనా బేరం కుదుర్చుకోవాలి అంటూ చమత్కరించాడు.

ప్రస్తుతం అతను ఐపీఎల్ లో సన్ రైజర్స్ టీం తరుపున క్రికెట్ ఆడుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube