పక్కా లోకల్ తో ఎన్ఠీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వార్నర్

క్రికెట్ స్టార్ గా వెలిగిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ లాక్ డౌన్ కారణంగా టిక్ టాక్ స్టార్ గా మారిపోయాడు.లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు అందరూ కూడా ఇలా టిక్ టాక్ వీడియో లు చేస్తూ నెటిజన్స్ ను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నారు.

 David Warner Pakka Local Ntr Bday Wishes-TeluguStop.com

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా గత కొద్ది రోజులుగా టిక్‌టాక్ వీడియోలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.కూతురుతో కలిసి ఒక వీడియో,భార్యతో కలిసి చాలా టిక్ టాక్ వీడియో లు తీసి పోస్ట్ చేస్తుండడం తో అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి.
మొన్న బన్నీ బుట్టబొమ్మ సాంగ్ కి స్టెప్ వేసిన ఈ జంట తాజాగా జూనియర్ ఎన్ఠీఆర్ పాట ‘పక్కా లోకల్ సాంగ్’ కు స్టెప్స్ వేసి ఫుల్ ఎంటర్ టైన్ చేశారు.జ‌న‌తా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్, కాజ‌ల్ అగ‌ర్వాల్‌లు ప‌క్కా లోక‌ల్ అనే సాంగ్‌కి మాస్ స్టెప్స్ వేసి ప్రేక్ష‌కుల‌ని ఎంతో థ్రిల్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు వార్నర్ జంట ఇదే సాంగ్ కు కలిసి డ్యాన్స్ చేసి మరి తారక్ కు పుట్టిన రోజు శుభాకంక్షాలు తెలిపారు.ఈ వీడియోని త‌న సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.

 David Warner Pakka Local Ntr Bday Wishes-పక్కా లోకల్ తో ఎన్ఠీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వార్నర్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హ్యాపీ బ‌ర్త్ డే ఎన్టీఆర్ అని శుభాకాంక్ష‌లు తెలిపారు.ప‌క్కా లోక‌ల్ సాంగ్‌కి వార్న‌ర్ వేసిన డ్యాన్స్ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

వార్నర్ తన టిక్ టాక్ వీడియో లతో నెటిజన్స్ కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ముఖ్యంగా ద‌క్షిణాది భాష‌ల‌కి సంబంధించిన పాట‌లు లేదా డైలాగ్స్‌ని వార్న‌ర్ ఎంచుకొని మరి టిక్‌టాక్ వీడియోలు చేస్తుండ‌డం మరింత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.తాజాగా ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న పాట‌కి టిక్‌టాక్ వీడియో చేసి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపడం విశేషం.

#Tiktok #DavidWarner #NTRBirthday #Buttabomma Song #David Warner

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు