ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఎవరో గుర్తు పట్టండి చూద్దాం...

ఫార్మెట్ ఏదైనా తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ క్రికెట్ అభిమానుల్ని ఎంతగానో అలరించేటువంటి ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే డేవిడ్ వార్నర్ లాక్ డౌన్ సమయంలో టిక్ టాక్ వీడియోలు చేస్తూ తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

 David Warner New Photos Like A Telugu Prabhas, David Warner, Australia Cricketer-TeluguStop.com

ఇందులో ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి అల వైకుంఠపురంలో చిత్రంలోని బుట్ట బొమ్మ పాట కి డాన్స్ చేస్తూ, మహేష్ బాబు పోకిరి సినిమాలోని డైలాగులను కూడా చెబుతూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

Telugu David, Davidtelugu, Prabhas, Telugu, Tollywood-Latest News - Telugu

అయితే సోషల్ మీడియా మాధ్యమాలలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేటువంటి డేవిడ్ వార్నర్ తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇంతకీ ఆ ఫోటోని ఒకసారి పరిశీలించినట్లయితే టాలీవుడ్ హీరో ప్రభాస్ ఫోటోని తన ముఖంతో కవర్ చేస్తూ తీసినటువంటి ఫోటోలను డేవిడ్ వార్నర్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. దీంతో కొందరు అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.

 అంతేకాక ఈ ఫోటోని షేర్ చేసిన కొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు కామెంట్లు వచ్చాయి.

కాగా ఇటీవలే ఓ నెటిజన్ మీరు టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వచ్చు కదా.? అని అడగడంతో డేవిడ్ వార్నర్ ఎవరైనా సరే చిత్ర యూనిట్ సభ్యులు నటించమని తనని సంప్రదిస్తే కచ్చితంగా నటిస్తానని సమాధానమిచ్చాడు. దీంతో ఆ మధ్య తొందర్లోనే టాలీవుడ్ సినిమా పరిశ్రమకి డేవిడ్ వార్నర్ నటుడిగా పరిచయం కాబోతున్నాడని పలు వార్తలు వినిపించాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం భారత్ తో జరుగుతున్నటువంటి 20-20 సిరీస్ లో డేవిడ్ వార్నర్ సెలెక్ట్ అయినప్పటికీ కాలికి దెబ్బ తగలడంతో జట్టు కి దూరంగా ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube