ఇటీవల కాలంలో క్రికెట్ లో కూడా సినిమా ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చూస్తూనే ఉన్నాం.క్రికెటర్స్ కూడా ట్రెండింగ్ లో ఉన్న పాటలకు వీడియోలు చేస్తూ నెట్టింట ఆ వీడియోలను పోస్ట్ చేయడంతో అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
ముఖ్యంగా పుష్ప సినిమా వచ్చిన తర్వాత ఇలా క్రికెటర్స్ రీల్స్ చేయడం మరీ ఎక్కువ అయ్యింది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వడంతో అప్పటి నుండి క్రికెటర్స్ వరుసగా ఆయన పాటలకు రీల్స్ చేయడంతో పాటు వార్నర్, జడేజా లాంటి క్రికెటర్స్ అయితే పుష్పరాజ్ లుక్ లోకి మారిపోయి అల్లు అర్జున్ మ్యానరిజాన్ని దించేశారు.
ఇక తాజాగా ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు సినిమాపై రీల్ చేసారు.వార్నర్ ప్రెసెంట్ ఐపీఎల్ లో ఢీల్లీ జట్టు తరపున ఆడుతున్నాడు.
ఈయన ఇంతకు ముందు చేసిన బుట్టబొమ్మ, పుష్ప రీల్స్ ఈయనను తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేసాయి.ఇక ఇప్పుడు మరోసారి ఈయన అదిరిపోయే రీల్ చేసాడు.
అది కూడా మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించిన రీల్ అది.
ఈ రీల్ తో వార్నర్ మరోసారి కంబ్యాక్ అయ్యారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్రుస్ లీ సినిమాలో మెగాస్టార్ ఎంట్రీ సీన్ పై వార్నర్ తన వీడియో చేసి పోస్ట్ చేసాడు.గెటప్ కూడా మెగాస్టార్ లాగానే చేయడంతో వార్నర్ చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.ఈ వీడియోను చుసిన నెటిజెన్స్ వార్నర్ కు ఫిదా అవుతున్నారు.
ఈయన మన తెలుగు సినిమాల రీల్స్ చేస్తూ తెలుగు పై అభిమానం చూపిస్తున్నారు.ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కూడా యాజిటీజ్ గా దించేయడంతో అందరు ఈ వీడియోకి ఫిదా అవుతున్నారు.