అరుదైన రికార్డ్ సృష్టించిన డేవిడ్ వార్నర్ !

ఐపీఎల్ 13 వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 50 సార్లు 50కిపైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

 David Warner Creates Rare Record, Ipl2020, Ipl, Orange Army,punjab, Warner, Bair-TeluguStop.com

గురువారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ ‌లో వార్నర్ 40 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌ తో 52 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఇక ,2009 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న వార్నర్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మూడు సీజన్లలో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా 2018లో సీజన్‌లో ఐపీఎల్‌ కు దూరం అయ్యాడు.

నిషేధం పూర్తికావడంతో గతేడాది మళ్లీ జట్టుతో వచ్చి చేరాడు.
గత సీజన్‌లో 12 మ్యాచుల్లో 692 పరుగులు చేసి మూడోసారి ఆరెంజ్ క్యాప్‌ అందుకున్నాడు.

తాజా మ్యాచ్‌లో వార్నర్ చేసిన అర్ధ సెంచరీతో 50సార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.అయితే , పంజాబ్ ‌పై వార్నర్‌ కు ఇది 9వ అర్ధ సెంచరీ కావడం విశేషం.

వార్నర్ ఐపీఎల్లో ఇప్పటి వరకు 46 అర్ధ సెంచరీలు నమోదు చేయగా, నాలుగు సెంచరీలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube