డ్యాన్స్ షోలు పక్కన పెట్టి,కుక్కింగ్ షో లు మొదలెట్టిన వార్నర్!  

David Warner Australia Bakes A Cake - Telugu Australia, Bakes A Cake, Coronavirus, David Warner, Lock Down, Sunrisers Hyderabad, Tiktok

కరోనా లాక్ డౌన్ తో ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లకే పరిమితమై పోవడం తో సెలబ్రిటీలు,సామాన్యులు అన్న తేడా లేకుండా టిక్ టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.క్రీడా కార్యకలాపాలు కూడా నిలిపివేయడం తో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కుటుంబం తో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియా లో సంచలనం రేపుతున్నాడు.

 David Warner Australia Bakes A Cake

దక్షిణాది చిత్రాల సాంగ్స్ పై కూడా భార్యతో కలిసి స్టెప్స్ వేస్తూ ప్రతి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం తో ఈ వీడియోలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.అయితే ఇప్పుడు డ్యాన్స్ లను పక్కనపెట్టి, కూతుళ్లతో కలిసి కుక్కింగ్ షో మొదలు పెట్టినట్లు ఉన్నాడు.

అందుకే తన ఇద్దరు కూతుళ్ళ తో కలిసి కేక్ ను తయారు చేస్తూ టిక్ టాక్ వీడియో చేశాడు.ఆ వీడియో కాస్త తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడం తో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

డ్యాన్స్ షోలు పక్కన పెట్టి,కుక్కింగ్ షో లు మొదలెట్టిన వార్నర్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఎప్పుడూ డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేసే వార్నర్ కొత్తగా తనలో ఉన్న వంట నైపుణ్యాన్ని బయటపెడుతూ కూతుళ్ల తో కలిసి ఇలా కేక్ తయారు చేశాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) యొక్క 2020 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించనుండగా,, అయితే మార్చి 29 నుండి మే 24 వరకు జరగాల్సిన ఐపీఎల్ టోర్నమెంట్‌ను కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా వేయాలని బీసీసీఐ ఏప్రిల్‌లో నిర్ణయించిన విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

David Warner Australia Bakes A Cake Related Telugu News,Photos/Pics,Images..

footer-test