శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన డేవిడ్ వార్నర్ కు నాటు నాటు కష్టమట!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.

 David Warner Anout Srivalli Steps And Naatu Naatu David Warner, Srivalli Steps, Rrr, Pushpa, Sports News-TeluguStop.com

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ పాటలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి స్టెప్పులను ఇరగదీశారు.ఇక ఈ పాటలోని స్టెప్పులను రీ క్రియేట్ చేస్తూ ఇప్పటికే చాలామంది వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 David Warner Anout Srivalli Steps And Naatu Naatu David Warner, Srivalli Steps, Rrr, Pushpa, Sports News-శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన డేవిడ్ వార్నర్ కు నాటు నాటు కష్టమట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందుకు సంబంధించి కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

సినిమాలోని స్టెప్పులను రీ క్రియేట్ సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు సైతం వీడియోలు చేశారు.

కానీ ఎంతమంది ఈ పాటకు స్టెప్పులు వేసిన కూడా తారక్, చెర్రీ లా ఎవరూ చేయలేకపోయారు.ఇక ఆ స్టెప్పులు డేవిడ్ వార్నర్ వల్ల సాధ్యం అవుతుందా? అన్న ప్రశ్నకు డేవిడ్ ఆ పాటలకు స్టెప్పులు వేయలేను అంటూ చేతులెత్తేశాడు.డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలను వ్యాప్తంగా ఫేమస్ చేస్తూ ఉంటాడు.ఇక ఇటీవలే పుష్ప ఈవెంట్లో దర్శకుడు మారుతి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సినిమాలను ప్రమోట్ చేస్తున్న డేవిడ్ వార్నర్ కు థాంక్స్ చెప్పాడు.

ఇక డేవిడ్ వార్నర్ కొత్త కొత్త సినిమాలలోని పాటలను,డైలాగ్స్,అలాగే డాన్స్ స్టెప్పులను డేవిడ్ వార్నర్ ట్రై చేస్తుంటాడు అన్న విషయం అందరికి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటలో స్టెప్పులను వేయడానికి ప్రయత్నించాడు.అల్లు అర్జున్ లా చేయకపోయినా కూడా తనదైన స్టైల్లో స్టెప్పులు ఇరగదీశాడు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వుకోవడమే కాకుండా నెక్స్ట్ ఏ సాంగ్ కు స్టెప్పులు చేస్తావు అని అడిగారు.

ఈ నేపథ్యంలోనే చాలా మంది నాటు నాటు స్టెప్పులను రీక్రియేట్ చేయమని అడిగినట్టున్నారు.దీంతో డేవిడ్ కూడా భయపడి.నాటు నాటు స్టెప్పులు చాలా కష్టమంటూ చేతులెత్తేశాడు.మొత్తానికి డేవిడ్ మాత్రం రామ్ చరణ్, తారక్‌ల మ్యాజిక్ రీ క్రియేట్ చేయలేనని చెప్పకనే చెప్పేశాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube