అత్తాకోడళ్ల గొడవ : బిందెతో కొట్టడంతో అత్త ...?   Daugter Law Kills Mother Law     2018-11-04   14:54:26  IST  Sai M

అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మా… కోడల్లేని అత్త గుణవంతురాలు… ఆహా… ఊహూ…” అనే పాట మీకు గుర్తుండే ఉంటుంది కదా. అత్తాకోడళ్ల మధ్య సాగే పిల్లి పోరు గురించి వ్యంగ్యంగా ఆ పాటలో రాసారు. చాలా ఇళ్లల్లో అత్తగారికి కోడలికి అస్సలు పొసగదు. మరి కొన్ని ఇళ్లల్లో అత్తలో అమ్మను చూసుకుంటూ ఉంటారు. అత్తా కోడళ్ల మధ్య గిల్లికజ్జాలు మాములే అయినా … ప్రాణాలు పోగొట్టే స్థాయిలో గొడవలు అప్పుడప్పుడూ … అక్కడక్కడా చోటు చేసుకుంటూ ఉంటాయి.

తాజాగా… పశ్చిమగోదావరి జిల్లాలోని ఇరవగవరం మండలం రేలంగిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో అత్తను కోడలు కొట్టి చంపేసింది. ఈ ఘటన ఇరగవరం మండలం రేలంగిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుటుంబ కలహాల కారణంగా అత్తాకోడళ్ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఒకరిపైనొకరు దూషించుకుంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అత్తపై కోడలు బిందెతో బలంగా మోదింది. దెబ్బ బలంగా తాకడంతో అత్త తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతిచెందింది. మృతురాలు కూసంపూడి మహాలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.