సుప్రీం సంచలన తీర్పు: తల్లిదండ్రుల ఆస్తిలో కూతుళ్లకు సమాన హక్కు

తల్లిదండ్రుల ఆస్తిలో కూతుళ్ల హక్కుల విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.తల్లిదండ్రుల ఆస్తిలో కూతుళ్లకు సమాన హక్కులు ఉంటాయని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

 Daughter, Supreme Court, Hindhu Succession Act, Parental Property, Judgement-TeluguStop.com

సవరించిన హిందూ వారసత్వ చట్టం 2005 ప్రకారం కుటుంబంలోని కుమార్తెలకు కొడుకులతో పాటు సమాన ఆస్తి హక్కులను కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.ఆస్తిలో కొడుకులకు ఉండే సర్వ హక్కులు కుమార్తెలకు వర్తిస్తాయని పేర్కొంది.

హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 2005 అమలుకు ముందే తండ్రి మరణించినప్పటికీ, తల్లిదండ్రుల ఆస్తిపై కూతుళ్లకు ఈ హక్కులు వర్తిస్తాయని సుప్రీంకోర్టు వెల్లడించింది.

జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ సంచలన తీర్పును ఇచ్చింది.

హిందూ వారసత్వ (సవరణ) చట్టం 2005 ప్రకారం కూతుళ్లకు తల్లిదండ్రుల ఆస్తిలో పూర్తి హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.చట్ట సవరణ సమయం 2005 సెప్టెంబర్ 9వ తేదీ నాటికి తండ్రి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా కూతుళ్లకు వారసత్వ హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube