అమెరికన్ గాట్ టాలెంట్ లో సత్తా చాటిన ఇండియన్ రైతు కూతురు

అప్పుడప్పుడు ఇండియన్ టాలెంట్ ని విదేశాలలో ప్రదర్శించే అవకాశం మనవాళ్ళకి వస్తుంది.అలాగే ఇండియన్ కల్చర్, ట్రెడిషన్ ఉట్టిపడే విధంగా విదేశాలలో చాలా మంది భారతీయులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు.

 Daughter Of A Bengal Farmer Made India Proud On American Got Talent, Indian Danc-TeluguStop.com

అలాగే రకరకాల సాహసాలు కూడా చేశారు.ప్రతి దేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాలెంట్ ని ప్రదర్శించే షోలని నిర్వహిస్తూ ఉంటారు.

అలాగే అమెరికన్ గాట్ టాలెంట్ కి మంచి గుర్తింపు ఉంది.ఈ రియాలిటీషో స్ఫూర్తితో చాలా దేశాలు గాట్ టాలెంట్ షోలని నిర్వహిస్తూ వస్తున్నాయి.

ఇలాంటి టాలెంట్ షోలలో భారతీయులు చాలా సార్లు పాల్గొన్నారు.ఈ అమెరికన్ గాట్ టాలెంట్ లో తాజాగా బెంగాల్ కోల్‌కతాకు చెందిన సోనాలీ మజుందార్, మరాజు కూడా తమ టాలెంట్ చూపించారు.

బాలీవుడ్ సినిమాలోని పాటకు అదిరిపోయేలా సల్సా డాన్స్ వేసి జడ్జిల మనసు గెలుచుకున్నారు.

ఇక ఈ షోలో సోనాలీ జీవితం గురించి తెలిసిన జడ్జిలు ఇప్పుడు ఆమెలో టాలెంట్ కి ఫిదా అయిపోయారు.

కలకత్తాలోని ఓ రైతు కూతురు సోనాలీ ప్రతి రోజు తండ్రితో పాటు పొలం పనులకి వెళ్తుంది.పొలంలో పంట పండిస్తే గాని రెండు పూతల పూట గడవని పరిస్థితి.

అలాంటి ఆమె టీవీలో బాలీవుడ్ సినిమాలు, పాటలు వస్తే చాలు టీవీకి అతుక్కుపోయేది.తాను కూడా ఏదైనా సాధించాలని కలలు కనేది.

ఓవైపు పొలం పనులు చేస్తూనే మరోవైపు తన ఫ్రెండ్ మరాజుతో కలిసి రోజూ 7 నుంచి 8 గంటలు డాన్స్ ప్రాక్టీస్ చేసింది.ఊళ్లోని పొలాల్లోనే ఈ డాన్సులు ప్రాక్టీస్ చేయడం గొప్ప విషయం.

వాళ్ళు ఒక డాన్స్ గ్రూప్ స్టార్ట్ చేసి దానికి ది బ్యాడ్ సల్సా గ్రూప్ అని పేరు పెట్టుకున్నారు.సోనాలీ, మరాజుకి అమెరికా గాట్ టాలెంట్‌ షోలో తమ టాలెంట్ చూపే చాన్స్ వచ్చింది.

అక్కడకు వెళ్లి బాలీవుడ్ పాటలకి స్టెప్పులు వేసి అక్కడ ఆహుతులని అలరించడంతో పాటు జడ్జ్ లని కూడా సోనాలీ మెప్పించింది.ఇప్పుడు దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపొయింది.

BAD Salsa from India Delivers Dance Unlike ANYTHING You've Seen! - America's Got Talent 2020

These two dancers from the Bivash Academy of Dance travelled all the way from Kolkata, India, to show off their talent! Bad Salsa performs an incredibly unique style of salsa to the song "Dhating Naach" from Phata Poster Nikhla Hero.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube