కన్నతండ్రి పై కూతురి దారుణం.. ?  

Bilaspur, Murder, daughter, killed, father - Telugu Bilaspur, Daughter, Father, Killed, Murder

నేటి సమాజంలో నానాటికి మానవ సంబంధాలు మంటకలిసి పోతున్నాయి.ఎవరికి ఎవరు కానట్లుగా ప్రవర్తిస్తున్నారు.

TeluguStop.com - Daughter Killed Father

ఆవేశం వస్తే చాలు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు.ఇలాంటి అనాలోచితమైన నిర్ణయాలతో వారి జీవితాలనే కాదు అయిన వారి పట్ల కూడా కర్కషంగా ప్రవర్తిస్తున్నారు.

ఇలాంటి ఘటనే ఛత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో జరిగింది.

బిలాస్‌పూర్‌ జిల్లా కాంచన్​పూర్​ గ్రామానికి చెందిన మాంగ్లు రామ్​ధనుకర్​(58)కు దివ్య సరస్వతి (28) అనే కుమార్తె ఉందట.

అయితే ఈమెకు వివాహమైన భర్తతో ఉన్న మనస్పర్దల కారణంగా తండ్రి వద్దే ఉంటుందట.ఈ క్రమంలో ఒకరోజు తన సెల్​ఫోన్​ కనిపించక పోవడంతో తండ్రి అడగ్గా, మొదట తాను తీయలేదని సమాధానమిచ్చాడట.

అయినా నమ్మకం కలగని సరస్వతి గట్టిగా అడగటంతో నీ ప్రవర్తన నచ్చకే ఫోన్​ దాచినట్లు చెప్పాడట.

ఆ మాటలకు కోపంతో ఉడికిపోతూ, పట్టరాని ఆవేశంలో కర్రతో కొట్టి, రాయితో తలపై మోది తండ్రిని హతమార్చిందట.

అదీగాక ఆ శవాన్ని తల్లి సహకారంతో ఇంటి ఆవరణలో పూడ్చిందట.కొన్ని రోజులుగా మాంగ్లు కనిపించక పోవడంతో చుట్టుపక్కల వారు నిలదీయగా పొంతలేని సమాధాలు చెప్పారట.

అనుమానం కలిగిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చిందట.దీంతో నిందితులిద్దరినీ అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

#Killed #Daughter #Father #Bilaspur #Murder

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు