అమ్మ బాబోయ్ : అత్త పెళ్లికి వెళ్లి వచ్చేలోపు కోడలు కొంప కొల్లేరు చేసిందిగా...

మామూలుగా ఇంటికి పెద్ద కోడలు అంటే ఇంట్లో ఉన్నటువంటి పూజ గదిలో దీపం పెట్టేది మాత్రమే కాకుండా కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఇంటి గుట్టుని రట్టు చేయకుండా కాపాడేదని కొందరు పెద్దలు చెబుతుంటారు. కానీ తాజాగా ఓ ఇంటి పెద్ద కోడలు చేసినటువంటి పని కారణంగా మొత్తం కుటుంబ సభ్యులు  పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

 Daughter In Law Stolen Gold Ornaments In Hyderabad-TeluguStop.com

వివరాల్లోకి వెళితే వెంకటస్వామి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో నివాసముంటున్నాడు.అయితే ఇటీవలే స్థానికంగా ఉన్నటువంటి ఓ యువతితో వెంకటస్వామి తన పెద్ద కొడుకుతో వివాహం చేశాడు.

ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది.కానీ ఇటీవలే వెంకట స్వామి భార్య తమ దగ్గరి బంధువుల పెళ్లి నిమిత్తమై బయటకు వెళ్లింది.

 Daughter In Law Stolen Gold Ornaments In Hyderabad-అమ్మ బాబోయ్ : అత్త పెళ్లికి వెళ్లి వచ్చేలోపు కోడలు కొంప కొల్లేరు చేసిందిగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 దీంతో ఆమె కోడలు ఇంట్లో ఉన్నటువంటి దాదాపుగా 25 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు మరియు వెండి ఆభరణాలతో తన పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం ఏమి ఎరగనట్లు తిరిగి వచ్చి ఇంట్లో దొంగలు పడి డబ్బు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారని నాటకం ఆడింది.

దీంతో వెంకటస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యులు కలిసి ఎలాగైనా దొంగలను పట్టుకుని తమ సొమ్మును తమకు ఇప్పించాలంటూ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చోరీ జరిగిన ప్రదేశాల్లో ఉన్నటువంటి సీక్రెట్ కెమెరాల ఆధారంగా వెంకట స్వామి పెద్ద కోడలు ఈ చోరీ చేసినట్లు కనుగొన్నారు. దీంతో ఆమెను తమదైన శైలిలో విచారించడంతో  తానె ఈ చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో నేరం ఒప్పుకుంది. దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#Hyderabad #AuntGo #DaughterIn #DaughterIn #GoldOrnaments

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు