ఆస్థి ఇవ్వలేదని మామ పై కారం చల్లిన కోడలు

ఆస్థి ఇవ్వలేదని మామ పై కారం చల్లిన కోడలు

ఒకప్పుడు కోడలి పై అత్త,మామల దాడుల ఘటనలు ఎక్కువగా ఉండేవి.కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.

 Daughter In Law Sprinkled Redchilli Powder On Father In Law For The Property-TeluguStop.com

అత్త,మామలపై కోడల్లే ఇప్పుడు దాడులు చేస్తున్నారు.దీనికి నిదర్శనం తాజాగా తిరుపతి లోని అనంత వీధిలో చోటుచేసుకుంది.

ఆస్తి కోసం వృద్ధుడి పై అతని కొడుకు,కోడలు గత కొంత కాలం నుంచి వేధింపులకు గురిచేస్తున్నారు.అయితే దీనిపై ఎన్నిసార్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు.

అంతేకాకుండా వృద్ధుడి పై ఎప్పటి నుంచో వేధింపులు పాల్పడుతున్నా కూడా బయట ప్రపంచానికి తెలియలేదు.అయితే ఉన్నట్టుండి ఆ వృద్ధుడు వేధింపుల సమయంలో బయటకు రావడం తో కోడలు, కారం పొడి చల్లడం, వెంటనే కొడుకు దాడికి దిగడం, దానికి కోడలి తమ్ముడు కూడా సహకరించడం వంటివి జరిగిపోయాయి.

అయితే ఇవన్నీ కూడా చూసిన స్థానికులు షాక్ కు గురయ్యారు.వెంటనే తేరుకొని బాధితుడిని స్థానికులు రుయా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.అయితే ఆ వృద్ధుడి పై దాడి జరుగుతున్నప్పుడు కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియా లో షేర్ చేయడం తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.అయితే ఈ వీడియో చూసిన పోలీసులు కూడా గతంలో ఆ వృద్ధుడు ఇచ్చిన కంప్లైంట్ పై కూడా దృష్టి పెట్టి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube