వైరల్.. అత్త కోసం బాయ్ ఫ్రెండ్ కావాలని ప్రకటన ఇచ్చిన కోడలు..!

పెద్దవాళ్ళు సాధారణంగా ఏదో ఒక వయసులో వంటరిగా ఉండాల్సి వస్తుంది.భార్య భర్తలు జీవితాంతం అయితే కలిసి ఉండలేరు.

 Daughter In Law Looking For A Boyfriend For Her Mother In Law-TeluguStop.com

ఏదో ఒక సమయంలో వాళ్ళు ఒంటరి జీవితం అనుభవించాల్సిందే.ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో సాధారణమైన విషయమే అయితే తన అత్త ఒంటరిగా ఉందని తన కోడలు ఇచ్చిన ప్రకటన విని అందరూ ఆశ్చర్య పోతున్నారు.

ఇలాంటి ప్రకటన కూడా ఇస్తారా అని అందరూ మాట్లాడు కుంటున్నారు.

 Daughter In Law Looking For A Boyfriend For Her Mother In Law-వైరల్.. అత్త కోసం బాయ్ ఫ్రెండ్ కావాలని ప్రకటన ఇచ్చిన కోడలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ ఆ కోడలు ఏమని ప్రకటన చేసిందా అని అనుకుంటున్నారా ఆగండి.

అక్కడికే వస్తున్నాము ఆ కోడలు ఏమని ప్రకటన ఇచ్చిందంటే ఆమె అత్త ఒంటరిగా ఉంటుందని ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చింది.ఈ విషయం విన్న వారంతా షాక్ అవుతున్నారు.

ఇలా కూడా ప్రకటించవచ్చా అని గుసగుసలు ఆడుకుంటున్నారు.

ఇప్పటి వరకు తల్లిదండ్రులకు పెళ్లిళ్లు చేసిన పిల్లల గురించి మనం చాలా సార్లు వినే ఉంటాం కానీ ఇలా బాయ్ ఫ్రెండ్ కోసం వెతికే పిల్లలను బహుశా మనం చూసి ఉండం అయితే అమెరికాలో మాత్రం ఇలాంటి అరుదైన ఘటన జరిగింది.

కొత్తగా అత్తగారి ఇంటికి వచ్చిన కోడలు తన 51 సంవత్సరాల అత్త కోసం 40 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వ్యక్తిని బాయ్ ఫ్రెండ్ గా వెతుకుతుందట.

అయితే ఈ బాయ్ ఫ్రెండ్ ఎప్పటికి కలిసి ఉండేందుకు కాదట కేవలం రెండు రోజులకు మాత్రమేనట.అదేంటి అనుకుంటున్నారా అవును ఆమె అలాగే ప్రకటన ఇచ్చింది.ఆమె తన స్నేహితురాలు పెళ్ళికి వెళ్ళాలట అలా వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారు ఒంటరిగా ఉంటారని అందుకే ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని వెతుకుతుంది.

రెండు రోజులు బాయ్ ఫ్రెండ్ గా ఉంటె 960 డాలర్లు ఇస్తానని ప్రకటన ఇచ్చింది.ఈ ప్రకటన కాస్త ఇప్పుడు వైరల్ అయ్యింది.ఏంటో ఎవరి ఆనందం వారిది.

#Advertisement #America #Daughter In-Law #Craiglist #Hudson Vally

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు