'అత్త'ను దారుణంగా కొట్టింది.. జైలుకెళ్లింది!

కాలం మారింది.కోడలిని అత్త తిట్టి, కొట్టేరోజులు పోయాయి.

 Indian Daughter-in-law Caught Beating Mother-in-law, Daughter In Law, Beating, M-TeluguStop.com

కోడల్లే అత్తని కొట్టే రోజులు వచ్చాయి అని అనడానికి ఈ వీడియోనే ఆదర్శం.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

హర్యానాలోని సోనిపట్‌లో 82 ఏళ్ల మహిళ తన కొడుకు, కోడలు మనవళ్లతో కలిసి నివసిస్తున్నారు. కోడలు స్థానికంగా ఏఎన్‌ఎంగా విదులు నిర్వహించగా కొడుకు పాల వ్యాపారం చేసేవాడు.

అయితే కోడలుకు అత్తకు అసలు పడదు.నిత్యం గొడవలు పడేవారు.కొడుకు ఇంట్లో లేని సమయంలో కోడలు అత్తని కొట్టేది, తిట్టేది.82 ఏళ్ళ వయసు ఉన్న అత్తకు కోడలు పని చెప్పేది.ఒకవేళ ఆ పని చెయ్యకపోతే విసుక్కుంటూ ఆమెను చిత్రహింసలకు గురి చేసి కొట్టేది.ఈ నేపథ్యంలోనే ఓ రోజు ఆ వృద్ధురాలికి పని చెప్పినప్పటికి చేయకపోవడంతో కోడలు తీవ్ర ఆగ్రహానికి గురైంది.

తీవ్ర కోపానికి గురైన కోడలు చెత్త ఎత్తే డేస్ పాన్ తో అత్త తలపై కొట్టింది.దీంతో ఆ వృద్ధురాలు ఏడుస్తూ లోపలికి వెళ్తుంటే ఆమెను వెంటాడి మరి దారుణంగా కొట్టింది.

అయితే ఇలా అత్తను కొట్టడం చూసిన ఆ వృద్ధురాలి మనవరాలు వీడియో తీసి తండ్రికి పంపించడమే కాకుండా సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అది వైరల్ గా మారింది.అంతే వీడియో ఒక్కసారిగా వైరల్ అవ్వడంతో కోడలిని, ఆమె తల్లిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube