తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు.. ఎందుకంటే..?!

ప్రస్తుతం ఉన్న రోజుల్లో కన్నవారికి తలకొరివి పెట్టడం కూడా చాలా కష్టమైన రోజులు నడుస్తున్నాయి.పరిస్థితులు ఇలా ఉన్న నేపథ్యంలో మరుసటి రోజు ఉదయం అయితే చాలు పెళ్లి పీటలపై మూడు ముళ్ళు వేయించుకోవాలి అనుకున్న ఓ అమ్మాయి విషాద గాధ ఇది.

 Gujarat Daughter Does Final Rites Of Foster Father, Daughter Marriage, Foster Fa-TeluguStop.com

తాను కొత్త జీవితంలోకి వెళ్లేందుకు యువతి సిద్ధమవుతున్న సమయంలో అకస్మాత్తుగా వారి ఇంట్లో ఓ విషాదం నెలకొంది.తనని అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు తండ్రి పరలోకానికి వెళ్లిపోవడంతో ఆవిడ ఆ వార్తను జీర్ణించుకోలేక తన వివాహాన్ని వాయిదా వేసుకుని మరీ.తాను కొడుకుగా మారి తన తండ్రికి తలకొరివి పెట్టింది.తన వివాహాన్ని వాయిదా వేసుకొని తన తండ్రి కోసం తలకొరివి పెట్టిన అమ్మాయి పై ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఎప్పుడు నుంచో వస్తున్న ఆచారాలను కాస్త పక్కన పెట్టి తాను తీసుకున్న నిర్ణయంపై నెటిజన్స్ హర్షధ్వానాలు వెలిబుచ్చుతున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ ప్రాంతంలోని వెరావల్ లో చోటు చేసుకుంది.అశోక్ తానా అనే 62 సంవత్సరాల ఉన్న వ్యక్తికి ఇది వరకు సంతానం లేదు.

అందుకుగాను తన సోదరి కుమార్తె అయిన ఆయుష్షుని కొద్ది రోజుల క్రితమే ఆయన దత్తత తీసుకొని ఆమెను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు.ఆవిడకు ఎటువంటి కష్టాలు రానివ్వకుండా చాలా జాగ్రత్తగా పెంచుకొని చివరికి పెళ్లి చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.

అయితే ఇందులో భాగంగానే డిసెంబర్ 7న ఆ అమ్మాయి పెళ్లిని నిర్ణయించగా పెళ్లికి ముందు రోజు ఆకస్మాత్తుగా అశోక్ కు గుండెపోటు వచ్చింది.

Telugu Final Rites, Foster, Gujarat, Gujaratfinal, Herat Attack-Latest News - Te

ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.అక్కడ ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం మరో హాస్పిటల్ చేర్పించడానికి రాజ్ కోట్ కు తరలించే ప్రయత్నం చేశారు.అయితే దురదృష్టవశాత్తు ఆయన మార్గమధ్యంలోనే తుది శ్వాస విడచగా ఆ విషయం తెలుసుకున్న పెంపుడు కూతురు బోరున విలపించింది.

దీంతో ఆ రోజు తన పెళ్లి జరగాల్సి ఉండగా దానిని కాస్త వాయిదా వేసుకొని చివరికి కుమార్తె కాస్త కొడుకుగా మారింది.దీంతో ఆవిడ దగ్గరుండి ఆయన అంత్యక్రియలను పూర్తి చేసింది.

తనను పెంచుకున్న కారణంగా కొడుకు లేని లోటును ఆవిడ తన తండ్రి చితికి నిప్పంటించి ఆయన రుణం తీర్చుకుంది.ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ.తన తండ్రి తనను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాడని, మంచి చదువులు చదివి ఎంతో ప్రేమగా చూసుకుంటాడు అని చెబుతూ… తన తండ్రి అంత్యక్రియలు జరిపించడానికి కొడుకులకు మాత్రమే అర్హత ఉందని, కాకపోతే తనకి కొడుకులు లేకపోవడంతో తానే కొడుకుగా మారి చివరికి కార్యక్రమాన్ని నిర్వహించానని తెలియచేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube