లక్షల హృదయాలను ద్రవింపజేసి డాక్టర్‌ నీకు సెల్యూట్‌ అని కన్నీళ్లు పెట్టించిన వీడియో

కరోనా కారణంగా కన్నీరు పెట్టిస్తున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేసి మరీ కరోనాపై పోరాడుతున్నారు.

 Karnataka State, Government Hospital, Doctors, Nurses, Isolation Wards, Corona V-TeluguStop.com

ముఖ్యంగా వైధ్య విభాగంకు చెందిన వారు తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతూ మరీ జనాల ప్రాణాలను కాపాడుతున్నారు.డాక్టర్లు నర్సులు కొందరు కనీసం కుటుంబంతో కూడా కలవడం లేదు.

ఐసోలేషన్‌ వార్డుల్లో ఇంకా క్వారెంటైన్‌ కేంద్రాల్లో పని చేస్తున్న వైధ్యులు ఇళ్లకు వెళ్లడం పూర్తిగా మానేసినట్లుగా తెలుస్తోంది.డాక్టర్లు పూర్తిగా హాస్పిటల్‌కు పరిమితం అవుతున్నారు.

తమ ద్వారా ఎక్కడ కుటుంబ సభ్యులకు వస్తుందో అనే ఆందోళనతో డాక్టర్లు ఇంకా హాస్పిటల్‌ సిబ్బంది ఇళ్లకు వెళ్లడం లేదనే విషయం అందరికి తెల్సిందే.తాజాగా కర్ణాటక రాష్ట్రం బెల్గాంలోని ప్రభుత్వ హాస్పిటల్‌ వద్ద కనిపించిన సంఘటన కటినాత్ముల హృదయాలను కూడా ద్రవింపజేసే విధంగా ఉంది.

ఒక లేడీ వైద్య సిబ్బంది ఇంటికి వెళ్లక 15 రోజులు అవ్వడంతో ఆమె 4 సంవత్సరాల పాప అమ్మ కావాలంటూ ఏడుస్తూనే ఉందట.దాంతో ఒక సారి చూపించి తీసుకు వద్దాం అనుకుని పాపను హాస్పిటల్‌ వద్దకు తీసుకు వెళ్లారు.

దూరంగా ఉండి అమ్మను చూసిన ఆ పాప అమ్మ కావాలి, దగ్గరికి రా అమ్మ అంటూ పిలిచింది.అమ్మ అంటూ బండి దిగేందుకు ప్రయత్నించింది.కాని ఆ తల్లి కరోనా భయంతో కూతురు వద్దకు వచ్చేందుకు ఒప్పుకోలేదు.కూతురు కళ్లలో నీళ్లు చూసి, కూతురు ఏడుపుతో వెనక్కు తిరిగి ఆ డాక్టర్‌ కూడా కన్నీరు పెట్టుకుంది.

ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటూ ఆ సంఘటన చూసిన ప్రతి ఒక్కరు కూడా కళ్లు చెమర్చుతున్నాయి.ఒక తల్లి కూతురు మాత్రమే కాకుండా మన దేశంలో ప్రపంచంలో ఎన్నో లక్షల మంది ఇలాంటి వేదన అనుభవిస్తున్నారు.

అలాంటి డాక్టర్స్‌కు మనం ఏం చేసినా తక్కువే.అందుకే ఈ విషయాన్ని షేర్‌ చేసి లైక్‌ చేసి వారికి సెల్యూట్‌ చేద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube