రోజూ ఖర్జూర తింటే ఎన్ని లాభాలో!

ఖర్జూరాని చాలామంది ఇష్టంగా తింటారు.ఇటు రుచిగా ఉంటూనే, మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ఖర్జూరం.

 Dates Should Be Included In Daily Diet … Know Why-TeluguStop.com

ఇందులో విటమిన్లు, అమినో ఆసిడ్స్, కాల్షియం దొరుకుతాయి.శరీరానికి ఆరోగ్యం అనే సంపదను సంపాదించిపెట్టే సామర్థ్యం ఖర్జూరానికి ఉంది.

రోజూ 10 ఖర్జూరాలు తింటే ఎన్ని లాభాలో ఓసారి చూడండి.

* ఖర్జూర సహజంగా బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది.

పొద్దున్నే ఖర్జూర కడుపులో పడితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

* నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి ఖర్జూర మంది ఉపశమనం.

రాత్రి పడుకునే ముందు కనీసం ఆరు ఖర్జురాలు తిని, నీళ్ళు తాగి పడుకోండి.నిద్ర బాగా పడుతుంది.

* కర్జురాలు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.

* గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది ఖర్జూర.

ఎందుకంటే దీంట్లో కొలెస్టరాల్ ఉండదు.

* ఖర్జూరలో ఫ్రక్టోజ్, సక్రోజ్ మరియు గ్లూకోజ్ ఉంటాయి.

మీ శరీరానికి బలాన్ని ఇస్తుంది ఖర్జూర.

* పాలలో ఖర్జూర వేసుకోని తాగితే ఎంతో ఉపయోగకరం.

రోగనిరోధకశక్తిని పెంచుకోవడానికి పాలు – ఖర్జూర కాంబినేషన్ సాహాయపడుతుంది.

* ఖర్జూరాల్లో లభించే కాల్షియం మీ ఎముకలకి బలాన్ని సమకూరుస్తుంది.

కండారాలకి శక్తిని అందిస్తుంది.అలాగే బాడి పేయిన్స్ ని పోగొడుతుంది.

* ఖర్జూరలో ఐరన్ దండిగా లభిస్తుంది.రోజూ ఖర్జూర తింటే రక్తహీనత లాంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.

* ఖర్జూరలో దొరికే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

* ఖర్జూరలో లభించే పొటాషియం బ్లడ్ ప్రెషర్ ని అదుపులో ఉంచుతుంది.

* విటమిన్ ఏ, యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన, ఖర్జూర కంటిచూపుకి మేలు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube