మీరు పుట్టినతేదిని బట్టి మీ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా?   Date Of Birth Predictions For Financial     2018-03-05   22:50:39  IST  Raghu V

ప్రతి మనిషి ఆర్ధికంగా స్థిరత్వం కలిగి ఉంటేనే జీవితంలో సమస్యలు లేకుండా హ్యాపీగా జీవితాన్ని గడుపుతాడు. ఎందుకంటే ఆర్ధిక స్థిరత్వం అనేది ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఆర్ధిక పరిస్థితి స్థిరంగా ఉండాలంటే మనిషి మనస్సు స్థిరంగా ఉండాలి. డబ్బు ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా ఉండకూడదు. డబ్బును ఎక్కువగా దుబారా చేస్తే లక్ష్మి దేవి ఇంటిలో ఉండదు. అందువల్ల ఇప్పుడు మీరు పుట్టినతేదిని బట్టి మీ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

మీరు పుట్టిన తేదీ,నెల,సంవత్సరం అన్ని కలిపితే 1 నుంచి 9 లోపు ఎదో ఒక నెంబర్ వస్తుంది. ఇప్పుడు 1 నుంచి 9 వ నెంబర్ వరకు ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

1 నెంబర్
వీరి ఆర్ధిక పరిస్థితి సంతృపిగా లేకుండా ఎప్పుడు డబ్బు కోసం ఇబ్బంది పడుతూనే ఉంటారు. వీరి వద్ద అవసరానికి ఎప్పుడు డబ్బు ఉండదు. కోరికలు తీరక బాధలు పడుతూ ఉంటారు. వీరికి దైవ అనుగ్రహం ఉంటుంది. వీరికి 40 సంవత్సరాలు దాటాక ఆర్ధిక స్థిరత్వం కలుగుతుంది.

2 నెంబర్
చంద్రుడికి శుక్ల పక్షం,చంద్ర పక్షం ఉండే విధంగానే వీరికి కూడా ఒక సమయంలో ఆర్ధిక పరిస్థితి బాగుండటం,మరొక సమయంలో బాగోకపోవటం…ఇలా జీవితం అంతా హెచ్చుతగ్గులతోనే గడుస్తుంది. మొత్తం మీద వీరి ఆర్ధిక పరిస్థితి పర్వాలేదని అనిపిస్తుంది.

3 నెంబర్
వీరి ఆర్ధిక పరిస్థితి చాల సంతృప్తికరంగా ఉంటుంది. వీరిలో ఎక్కువ మంది పుట్టుకతోనే శ్రీమంతులు. వీరు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా జీవితాన్ని హ్యాపీగా గడుపుతారు. వీరి చేతిలో ఎప్పుడు డబ్బు ఉంటుంది. అయితే కొన్ని వ్యసనాల కారణంగా చేతిలో కొంత ఆదాయం తగ్గుతుంది.

4 నెంబర్
వీరిలో ఎక్కువమంది ధనవంతులుగా ఉంటారు. వీరు తండ్రి దగ్గరి నుంచి వచ్చిన ఆస్థి కన్నా సొంతంగా సంపాదించిన ఆస్థి ఎక్కువగా ఉంటుంది. ఎంత సంపాదించినా పొదుపు చేసే ఆలోచన ఉండదు. కాస్త ఖర్చు ఎక్కువగా పెడుతూ ఉంటారు.

5 నెంబర్
సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదనే సామెత ఉంది కదా. ఈ సామెత వీరికి సరిపోతుంది. వీరికి సరిపడా ఆదాయం ఉన్న పొదుపు చేసే ఆలోచన ఉండదు. అలాగే ఖర్చు కూడా ఎక్కువగానే పెడుతూ ఉంటారు. వచ్చిన అవకాశాలను మాత్రం బాగా ఒడిసి పట్టుకోవటంలో దిట్ట.

6 నెంబర్
వీరి ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. వీరు కాస్త ఖర్చు ఎక్కువ పెట్టిన, దానికి తగ్గ ఆదాయం ఉంటేనే ఖర్చు పెడతారు. వీరు పుట్టుకతోనే శ్రీమంతుడు కావటంతో ఎంత ఖర్చు పెట్టిన రాదు.

7 నెంబర్
వీరి జీవితం అంతా ఆర్ధిక పరిస్థితి హెచ్చు తగ్గులు,లాభనష్టాలు ఎక్కువగా ఉంటాయి. వీరి అవసరాలకు ఎదో ఒక విధంగా డబ్బు సర్దుబాటు అవుతుంది. దాంతో ఆర్థికపరమైన కష్టాలు ఉండవు. అయితే కొన్ని వ్యసనాల కారణంగా ఉన్నది పోగొట్టుకొనే పరిస్థితి వస్తుంది.

8 నెంబర్
వీరి ఆర్ధిక పరిస్థితి హెచ్చు తగ్గులతో ఉండి, ఒకానొక సమయంలో ఎక్కువగా నష్టాలు వచ్చిన చివరకు చక్కబడుతుంది. వీరి జీవితం 30 సంవత్సరాల తర్వాత చాలా బాగుంటుంది.

9 నెంబర్
వీరి ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండదు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం చేతికి డబ్బు అందుతుంది. వీరు కాస్త ఎక్కువగా ఖర్చు పెట్టటం వలన అప్పుడప్పుడు కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి.