యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకుని తన కెరీర్లో 20వ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు.ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇటీవల జార్జియాలో షూటింగ్‌ను ముగించుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ గురించి ఎలాంటి వార్త వచ్చినా ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను అదిరిపోయే రీతిలో ఉగాది పండగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నారట చిత్ర యూనిట్.
ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా ఓకే చేశారట చిత్ర యూనిట్.
అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో వస్తుందని, ఈ ఉగాది పండగ ఫ్యాన్స్‌కు నిజమైన పండగే అని అంటున్నారు చిత్ర యూనిట్.ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దుతుండగా, పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.