భీమ్లా నాయక్ నుంచి మరో పాట రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈయన సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ అనే చిత్రంలో నటిస్తున్నారు.

 Date Fix For Another Song Release From Bheemla Nayak Details,  Bheemla Nayak, Pa-TeluguStop.com

ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి పలు కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం వెల్లడించారు.

సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లను విడుదల చేస్తూ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచారు.ఈ క్రమంలోనే ఇప్పటివరకూ విడుదలైన పాటలు, టీజర్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ఇదిలా ఉండగా గత రెండు రోజుల క్రితం ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేశారు.తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Telugu Bheemla Nayak, Nithya Menon, Pawan Kalyan, Rana Daggubati, Sagark Chandra

ఈ క్రమంలో ఈ సినిమా నుంచి మరో పాటను ఈనెల 25వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక పాట పాడారు అని బహుశా అదే పాటని 20వ తేదీ విడుదల చేయబోతున్నారా అంటూ నెటిజన్లు సందేహాలను వ్యక్త పరుస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ ఇది వరకే అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడు అనే పాట పాడి విశేష ప్రేక్షకాదరణ పొందాడు తాజాగా ఈ సినిమాలో మరోసారి తన గొంతును సవరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube