డేట్, ప్లేస్ ఫిక్స్ చేసిన మహేష్.. దేనికో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మహేష్ సరికొత్త రికార్డులకు తెరలేపాడు.

 Date And Venue Locked For Sarileru Neekevvaru 50 Days Event-TeluguStop.com

వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమాతో మహేష్ మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించాడు.

కాగా ఈ సినిమా మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్ల షేర్ వసూళ్లకు పరుగులు పెడుతున్న ఈ సినిమా మరో అరుదైన ఫీట్‌ను అందుకోనుంది.ఇటీవల కాలంలో సినిమాలు నెలరోజులు ఆడటమే లేదు.

అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా ఏకంగా 50 రోజుల వేడుకను జరుపుకునేందుకు రెడీ అవుతోంది.

ఈ చిత్రం ఫిబ్రవరి 29న 50 రోజులు పూర్తి చేసుకోనుంది.

కాగా ఈ వేడుకలను మార్చి 1న కర్నూలులో జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ వేడుకలను అంగరంగ వైభవంగా చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది.

మహేష్ పవర్‌ప్యాక్ పర్ఫార్మెన్స్‌కు రష్మిక అందాలు, విజయశాంతి పవర్‌ఫుల్ రీఎంట్రీ తోడవడంతో సినిమా సూపర్ సక్సె్స్ అయిన విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube