బద్వేల్ లో వైసీపీ విజయం ! మెజార్టీ ఎంతంటే ?

ముందుగా అందరూ ఊహించినట్లుగానే ఏపీ లోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాసరి సుధ భారీ ఆధిక్యతతో గెలిచారు.మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో గెలుపుపై వైసిపి ధీమాగా ఉంటూ వచ్చింది.

 Dasari Sudha Is The Winning Ycp Candidate In Badwell Constituency Ysrcp, Badvel-TeluguStop.com

కాగా జనసేన ,తెలుగుదేశం పార్టీలు పోటీకి దూరంగా ఉన్నా, ఇక్కడ బరిలో ఉన్న బిజెపి అభ్యర్థి కి పరోక్షంగా సహకారం అందించారు.ఇక్కడ వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన సుధ బిజెపి అభ్యర్థి సురేష్ పై 90, 228 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

  బద్వేలు నియోజకవర్గంలో వైసీపీకి మొత్తం 1, 11, 710 ఓట్లు రాగా , బీజేపీ కి 21,612 ఓట్లు లభించాయి.మొత్తం బద్వేలు నియోజకవర్గంలో 1, 46, 546 ఓట్లు పోలయ్యాయి.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 6,205 ఓట్లు వచ్చాయి.
         ఇక నోటాకు 3,635 ఓట్లు వచ్చాయి.

పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ కి 139, బీజేపీ కి 17, కాంగ్రెస్ కు 18 ఓట్లు లభించాయి.నోటా కు ఒక ఓటు వచ్చింది.

దీంతో 90, 228 ఓట్ల తేడాతో వైసిపి అభ్యర్థి దాసరి సుధ విజయం సాధించారు.దాసరి సుధ గెలుపుపై మొదటి నుంచి అందరికీ అంచనాలు ఉన్నాయి.

దీనికి తగ్గట్లుగానే మొదటి రౌండ్ లెక్కింపు దగ్గర నుంచి వైసీపీకి మెజార్టీ కనిపించింది .మొదటి రౌండ్ లో 9 వేల ఓట్లు, రెండో రౌండ్ లో 8,300 ఓట్లు, మూడో రౌండ్ లో 7,879 ఓట్లు , నాలుగో రౌండ్ లో 7,626 ఓట్లు, ఐదో రౌండ్ లో 9,986 ఓట్లు , ఆరో రౌండ్ లో 9,443 ఓట్లు, ఏడో రౌండ్ లో 8,741 రౌండ్ల ఓట్ల ఆధిక్యం లభించింది.
   

Telugu Ap, Badvel, Dasari Sudha, Jagan, Kadapa, Ysrcp-Telugu Political News

 ప్రతి రౌండ్ లోనూ వైసిపి మెజారిటీ స్పష్టంగా కనిపించింది.బిజెపి ఈ ఎన్నికల్లో ఓడినా భారీ స్థాయిలో ఓట్లను రాబట్టగలము అనే ధీమాతో ఉంటూ వచ్చింది.  2019 ఎన్నికల్లో కేవలం 1000 లోపు మాత్రమే ఓట్లు సంపాదించుకున్న బిజెపి ఇప్పుడు ఇరవై వేలకు పైగా సంపాదించడానికి కారణం టిడిపి జనసేన పరోక్ష సహకారమే.ఈ ఎన్నికల్లో బిజెపి బూత్ ఏజెంట్లుగా టిడిపి నాయకులు ఉండడం పై పెద్ద చర్చే జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube