మిస్ అయిన దాసరి పెద్ద కుమారుడు...కారణం!  

Dasari Elder Son Away-

ప్రముఖ దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు గురించి సినీ ఇండస్ట్రీ లో తెలియని వారు లేరు.150 సినిమాలకు పైగా దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్న దాసరి కుటుంబం విషయం లో మాత్రం ఎంత మాత్రం సక్సెస్ ని సాధించలేకపోయారు.ఆయన ఉన్నా లేకపోయినా కూడా ఆయన కుటుంబం మాత్రం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది.దాసరి మృతి చెందిన తరువాత దాసరి పెద్ద కోడలు మీడియా ముందుకు వచ్చి తన ఆస్తి కొట్టేశారు అంటూ ఆరోపణలు చేసింది...

Dasari Elder Son Away--Dasari Elder Son Away-

అయితే ఇప్పుడు తాజాగా దాసరి పెద్ద కుమారుడు దాసరి ప్రభు కనిపించడం లేదంటూ ఫిర్యాదు నమోదైంది.దీనితో ఇప్పుడు ఈ అంశం సంచలనం గా మారింది.జూన్ 9వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ తిరిగి రాలేదు.దాంతో ప్ర‌భు కుటుంబ స‌భ్యులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

అయితే ప‌దేళ్ల క్రితం కూడా ప్ర‌భు ఇలాగే ఒకసారి మిస్ అయి కొద్దీ రోజుల తరువాత తన భార్యే తనను కిడ్నాప్ చేయించింది అంటూ ఆరోపణలు చేశారు.

Dasari Elder Son Away--Dasari Elder Son Away-

అయితే ఇప్పుడు తాజాగా ప్రభు కనిపించకపోవడం తో మళ్లీ అలాంటిదే ఏదైనా జరిగిందా లేదా మరేదైనా కారణమా అన్న కోణం లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.1995 లో సుశీల ను ప్రభు ప్రేమ వివాహం చేసుకున్నారు.అయితే గత కొంత కాలంగా వారి మధ్య ఆస్తి తగాదాలు చోటుచేసుకున్నాయి.

అయితే దాసరి మృతి తరువాత అవి మరింత తీవ్రతరం అయ్యాయి.ఈ క్రమంలో ఇప్పుడు ప్రభు కనిపించక పోవడం తో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.దాసరి కి ఇద్దరు కుమారులు కాగా, ప్రభు పెద్ద కుమారుడు, అరుణ్ చిన్న కుమారుడు.

దాసరి అరుణ్ కొన్ని చిత్రాల్లో నటించి అలరించిన సంగతి తెలిసిందే.