దాసరి ఫ్యామిలీ విషయంలో చిరు జోక్యం నిజం కాదట  

Dasari Arun Chiranjeevi Property Disputes - Telugu Chiranjeevi, Dasari Arun, Dasari Narayana Rao, Properties, Property Dispute

దాసరి నారాయణ రావు ఇద్దరు కొడుకులు ఆస్తి వివాదంతో రోడ్డు ఎక్కిన విషయం తెల్సిందే.బాహా బాహీకి దిగిన ఇద్దరు అన్నదమ్ములు పోలీసులను కూడా ఆశ్రయించారు.

 Dasari Arun Chiranjeevi Property Disputes

ఇదే సమయంలో సినీ ప్రముఖులు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనేది రెండు రోజులుగా మీడియాలో వార్త.ఇద్దరిని కూర్చో బెట్టి చిరంజీవి మాట్లాడాలని చాలా మంది అభిప్రాయపడ్డారు.

అందుకే వారిద్దరితో ఇప్పటికే చిరంజీవి ఫోన్‌లో మాట్లాడి సామరస్యంగా చర్చించుకోవాలంటూ సూచించాడు అనే వార్తలు వస్తున్నాయి.

దాసరి ఫ్యామిలీ విషయంలో చిరు జోక్యం నిజం కాదట-Movie-Telugu Tollywood Photo Image

మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని అసలు ఇప్పటి వరకు చిరంజీవి గారు మాకు ఫోన్‌ చేయలేదు.

ఆయన మా విషయంలో జోక్యం చేసుకోలేదు అంటూ దాసరి అరుణ్‌ అన్నాడు.అందరు అన్నదమ్ముల మద్య ఉండే సామాన్యమైన ఆస్తి తగాదాలే మా ఇద్దరి మద్య ఉన్నాయి అని అంతకు మించి ఏమీ లేవు అంటూ అరుణ్‌ అన్నాడు.

ఈ విషయాన్ని తామే పరిష్కరించుకుంటామని ఇందులో ఎవరి ఇన్వాల్వ్‌మెంట్‌ అవసరం లేదు అంటూ అరుణ్‌ పేర్కొన్నాడు.

చిరంజీవి ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్‌ అవ్వడు అనేది కొందరి అభిప్రాయం.ప్రస్తుతం దాసరి కుటుంబ సభ్యులు అడిగినా కూడా చిరంజీవి మాత్రం అందుకు ఆసక్తి చూపడం లేదు అంటున్నారు.దాసరి ఇండస్ట్రీలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించారు.

వ్యక్తిగత విభేదాలను కూడా దాసరి కూర్చోబెట్టి సెటిల్‌ చేసిన సందర్బాలు ఉన్నాయి.కాని ఇప్పుడు ఆయన ఇంట సమస్య వస్తే పరిష్కరించేందుకు ఎవరు లేకపోయారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dasari Arun Chiranjeevi Property Disputes Related Telugu News,Photos/Pics,Images..

footer-test