దసరా సినిమాల పోగ్రెస్‌ రిపోర్ట్‌  

Dasara Movies Progress Report-

దసరా వచ్చి వెళ్లి పోయింది, అయితే ఆ పండుగ తెచ్చిన సందడి మాత్రం టాలీవుడ్‌లో కొనసాగుతూ వస్తుంది. దసరా పండుగ సందర్బంగా అరవింద సమేత, హలో గురూ ప్రేమకోసమే, పందెంకోడి 2 చిత్రాలు విడుదలైన విషయం తెల్సిందే. ఈ మూడు చిత్రాల్లో భారీ అంచనాలను మోసుకు వచ్చిన చిత్రం ‘అరవింద సమేత’. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంకు సూపర్‌ హిట్‌ టాక్‌ వచ్చింది..

దసరా సినిమాల పోగ్రెస్‌ రిపోర్ట్‌-Dasara Movies Progress Report

భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొంది, విడుదలైన ఈ చిత్రం అంతే భారీ వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే ఈ చిత్రం నాన్‌ బాహుబలి రికార్డును దక్కించుకుంది. ఇక ఆ తర్వాత కూడా మంచి వసూళ్లను తెలుగు రాష్ట్రాల్లో రాబడుతోంది.

అయితే ఓవర్సీస్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేక పోతుంది.

అరవింద సమేత చిత్రం అన్ని ఏరియాల్లో కలిపి 93 కోట్లకు అమ్ముడు పోయింది. ఇప్పటి వరకు దాదాపు 85 కోట్ల షేర్‌ను మాత్రమే రాబట్టింది. అంటే ఇంకా ఈ చిత్రం 8 కోట్లను రాబడితే తప్ప డిస్ట్రిబ్యూటర్లు ఒడ్డున పడరు. అయితే అరవింద జోరు చూస్తుంటే 8 కోట్లు ఏంటీ 10 కోట్లు కూడా ఈజీగానే రాబడుతుందనిపిస్తుంది. ఇక హలో గురు ప్రేమకోసమే చిత్రంపై భారీ అంచనాలు రావడంతో సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది. కాని ఇప్పటి వరకు 10 కోట్ల షేర్‌ను మాత్రమే రాబట్టింది. హలో గురు ప్రేమకోసమే బ్రేక్‌ ఈవెన్‌ దక్కాలి అంటే ఇంకా 15 కోట్ల వరకు రాబట్టాలని ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. కాని మరో అయిదు కోట్ల కంటే ఎక్కువ రాబట్టే అవకాశం లేదని తేలిపోయింది.

ఇక పందెం కోడి చిత్రాన్ని తెలుగు రైట్స్‌ను 6.5 కోట్లకు నిర్మాత ఠాగూర్‌ మధు కొనుగోలు చేయడం జరిగింది. ఆయన పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆయనకు దాదాపుగా 5 కోట్ల వరకు రిటర్న్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది. మరో కోటిన్నర షేర్‌ను దక్కించుకుంటే ఆ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ కొట్టినట్లే అంటూ ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. మూడు సినిమాలు కూడా ఒక మోస్తరుగా ఆడుతున్నా కూడా భారీ బిజినెస్‌ు చేయడం వల్ల సినిమాలు ఇంకా బ్రేక్‌ ఈవెన్‌కు దూరంలో ఉన్నాయి.