నేటి నుండి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు … దర్శనానికి వెళ్లాలంటే అలా చేయాల్సిందే !  

vijayawada kanakadurga temple ,dasara-festival, kanakadurga, ap, cm jagan, apcmjagan - Telugu Ap, Cm Jagan, Dasara Festival

ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది.నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.

TeluguStop.com - Dasara Festival Starts From Today Vijayawada Kanakadurga Temple

ఈ తొమ్మిది రోజుల సమయంలో మొత్తం పది అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది.మొదటి రోజైన ఈ రోజు దుర్గమ్మ స్వర్ణకవచాలంక్రుత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది.

ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనార్ధం భక్తులకు అనుమతి ఇస్తారు.

TeluguStop.com - నేటి నుండి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు … దర్శనానికి వెళ్లాలంటే అలా చేయాల్సిందే -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కరోనా మహమ్మారి వ్యాప్తి‌ దృష్ట్యా రోజుకు పది వేల మంది భక్తులకు మాత్రమే కొండపైకి అనుమతి ఇవ్వనున్నారు.

అలాగే ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకొని భక్తులకు కొండపైకి అనుమతి ఉండదు.వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

ప్రత్యక్ష పూజలకు అనుమతి నిరాకరించిన దేవస్థానం.పరోక్షంగా జరిగే పూజలను వీడియోస్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించింది.

ఉత్సవాలకు నాలుగు వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

వీఐపీలకు ఉదయం 7 నుంచి 9 వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటలు వరకే అనుమతి ఉంటుందని ఈవో సురేష్ బాబు చెప్పారు.

వీఐపీలు కూడా ఆన్‌లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు.టైం స్లాట్ ప్రకారమే రావాలని తేల్చి చెప్పారు.

ఆన్‌లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఐడీ కార్డు ఉంటేనే అనుమతిస్తామని తేల్చి చెప్పారు.అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు చీరను సమర్పించనున్నారు.

#Dasara Festival #CM Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dasara Festival Starts From Today Vijayawada Kanakadurga Temple Related Telugu News,Photos/Pics,Images..