ఈ ఆఫర్ తో ఎస్బీఐ కస్టమర్లకు' పండగే !  

Dasara Festival Offers Announced By Sbi Yono-

పండుగ ఆఫర్స్ తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎస్బీఐ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా దసరా పండగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఎస్బీఐ కి చెందిన డిజిటల్‌ వేదిక యోనో (వైవోఎన్‌వో) యాప్‌ ద్వారా కొనుగోళ్లు చేసేవారికి ప్రత్యేక రాయితీలు ప్రకటించింది.

ఇందుకోసం తాము 85 ఈ -కామర్స్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఎస్బీఐ మేనేజింగ్ డైరక్టర్ పీకే గుప్తా తెలిపారు.

ఈ ఆఫర్ తో ఎస్బీఐ కస్టమర్లకు' పండగే ! -Dasara Festival Offers Announced By Sbi Yono

వాటిలో అమెజాన్‌, జబాంగ్‌, మింత్రా, కల్యాన్‌, క్యారట్‌లేన్‌, పీసీజే, పెప్పర్‌ఫ్లై, ఓయో, టాటాక్లిక్‌, యాత్ర, ఈజ్‌మైట్రిప్‌, ఫస్ట్‌క్రై, ఐజీపీ, ఫెర్న్స్‌ అండ్‌ పెటల్స్ కంపెనీలు ఉన్నట్లు గుప్తా చెప్పారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ పవర్డ్ మొబైల్ ఫోన్లలో యోనో యాప్ అందుబాటులోకి వస్తుంది. ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, బహుమతులు, నగలు, ఫర్నీచర్‌, ట్రావెల్‌, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఆఫర్లు లభిస్తాయని సూచించారు.

డిజిటల్‌ షాపింగ్‌ వేడుకను అందిస్తున్న తొలి బ్యాంకు తమదేనని ఎస్బీఐ తెలిపింది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా అక్టోబర్‌ 16-21 వరకు కొనుగోళ్లు జరిగే వినియోగదారులకు సంస్థ 10 శాతం వరకు రాయితీ, క్యాష్‌బ్యాక్‌ అందిస్తామని తెలిపింది.