దసరా పండుగ అంటే సినిమా పండగ.ఈ సినిమాకి కేవలం ఆయుధపూజ మాత్రమే కాదు సినిమాకి కూడా ఒకసారి కొత్త కల వస్తుందని అభిమానులే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీ అంత గట్టిగా నమ్ముతుంది.
అందుకే దసరా కి బాక్సాఫీస్ కి ఏ హీరోలు బరిలో నిలువ బోతున్నారు, ఎవరు సినిమా యుద్ధం చేయబోతున్నారనే విషయంపై ఇప్పటికే సోషల్ మీడియాలో లో పోస్టులు దర్శనం ఇస్తున్నాయి.దాంతో దసరా వరిలో నిలిచే సినిమాల గురించి ఓ క్లారిటీ కోసం ప్రేక్షకుల ఎదురుచూపు మొదలైంది.
ఇక దసరా బరిలో నిలిచే సినిమాలు ఏంటో ఇప్పటివరకైతే ఎవ్వరు అఫీషియల్ గా కన్ఫామ్ చేయలేదు కానీ వస్తున్న టీజర్స్ లుక్స్ ప్రకారంగా ఈ సినిమాలే రాబోతున్నాయని ఒక అంచనా మాత్రం ఫిక్స్ అయిందనే చెప్పాలి.ఇప్పుడు ఈ విషయంపై పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇక ఈసారి బాక్స్ ఆఫీస్ కి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ బరిలో దిగి బాక్సాఫీస్ ఫైట్ కి సిద్ధం అనేస్తున్నారు.ఆచార్య సినిమాతో డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కి మెగాస్టార్ తన టీజర్ తో మంచి ఊపునిచ్చారు వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆ తన టీజర్ ని వదిలి అందరిలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చారు.
కేవలం ఈ టీజర్ లోని లుక్ ద్వారా ఈ సినిమా దసరాకి రాబోతున్నట్టు కన్ఫర్మ్ చేసేసారు.ప్రస్తుతం టీం మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఈ టీజర్ ని చూసి తెగ సంబరపడిపోతున్నారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మరొక సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి తెలుగు రీమేక్ విషయం మన అందరికీ తెలుసు.ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన కొత్త లుక్ ని కూడా ఇటీవల విడుదల చేయగా దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.వాస్తవానికి ఈ మధ్యకాలంలో వస్తున్న మలయాళ రీమేక్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్న నేపథ్యంలో గాడ్ ఫాదర్ కూడా మంచి హిట్ అవుతుందని మెగా ఫాన్స్ అంతా కూడా భావిస్తున్నారు.
ఇక అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత బాలకృష్ణలో ఎక్కడా లేని ఒక ఎనర్జీ కనిపిస్తోంది.అంతేకాదు నందమూరి ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు.ఇదే సందర్భంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సైతం సూపర్ మాస్ లుక్ లో కనిపించి తన అభిమానులకు కనువిందు చేయబోతున్నారు.ఇక తాజాగా వదిలిన టీజర్ చూస్తే ఫాన్స్ లో పూనకాలు అప్పుడే మొదలయ్యాయి.
ఇక ఈ సినిమాలో దునియా విజయ్ సైతం ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.బాలకృష్ణకి మెయిన్ విలన్ గా దునియా విజయ్ నటిస్తున్న అనే విషయం అటు కన్నడ లో ఇటు తెలుగు లో మంచి వైరల్ గా మారింది.
ఇక ఇప్పటికే అవుట్ డోర్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తుండగా హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతుంది.షెడ్యూల్ కనుక అనుకున్న ప్రకారం పూర్తయితే ఈ సినిమాను కచ్చితంగా నందమూరి అభిమానులు దసరా సందర్భంగా చూసేదానికి రెడీ అయిపోవచ్చు ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టాలని అందరూ ఎదురు చూస్తున్నారు.ఇక నాని మొదటి సారి తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ ఒక అద్భుతమైన మాస్ క్యారెక్టర్ లో రాబోతున్న సినిమా సైతం దసరాకే విడుదల అవుతుండడం కూడా మంచి విశేషంగా చెప్పుకోవచ్చు.సింగరేణి నేపథ్యంలో ఈ సినిమా రాబోతుండగా ఇప్పటికే నానికి సంబంధించిన లుక్ టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసి ఈ సినిమాపై అభిమానంలో అంచనాలను భారీగా పెంచేశారు.
ఇక పైన చెప్పిన అన్ని సినిమాలకు పోటీగా ధనుష్ వెంకీ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుండగా ఈ సినిమాకి మంచి అంచనాలైతే వచ్చేసాయి.ఇక మొదటిసారిగా హీరో ధనుష్ నేరుగా తీస్తున్న తెలుగు సినిమా కావడం తో మరింత హైప్ వచ్చింది.ఇక ఈ చిత్రానికి ‘సార్’ అనే సినిమా కూడా దసరాకే రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది అలాగే ఇన్ని సినిమాలతో ధనుష్ పోటీ పడబోతున్నాడు అందుకే ఈ దసరా రసవత్తరంగా ఉండబోతుందనేది కన్ఫామ్ గా తెలుస్తున్న వార్త.