ప్రభాస్ సాలార్ కి క్లాప్ కొట్టేది రేపే... ముఖ్య అతిథిగా ఎవరంటే  

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ పూర్తి చేసేలోపే మరో మూడు పాన్ ఇండియా సినిమాలు రెడీ చేసుకున్నాడు.అందులో ఒక్కొక్కటిగా సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాడు.

TeluguStop.com - Darling Prabhas Salaar Movie Opening Tomorrow

ఇప్పటికే ఆది పురుష్ సినిమా షూటింగ్ కి దర్శకుడు ఓం రౌత్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.మరో వైపు నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రీప్రొడక్షన్ చివరి దశకి చేరుకుంది.

ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాని కూడా ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు.ఆది పురుష్ పూర్తిచేసిన వెంటనే సలార్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

TeluguStop.com - ప్రభాస్ సాలార్ కి క్లాప్ కొట్టేది రేపే… ముఖ్య అతిథిగా ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే సంక్రాంతి సందర్భంగా ఇప్పుడు సలార్ సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయిపోయింది.హైదరాబాద్ లో ఈ సినిమాని లాంచ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

రేపు ఉదయం 11 గంటలకి చిత్ర నిర్మాతలు, దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ మీద ఫస్ట్ షాట్ కి క్లాప్ కొట్టడానికి రెడీ అయ్యాడు.ఇక ఈ సినిమా ప్రారంభోత్సవం చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్ తో పాటు దర్శక దిగ్గజం రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు.రాకింగ్ స్టార్ యష్ కూడా ఈ సినిమా ప్రారంభోత్సవంలో భాగం కాబోతున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ తో పాటుమిగిలిన మెయిన్ లీడ్ కి ఆర్టిస్ట్ లని రేపే పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తున్న నేపధ్యంలో రేపు సలార్ క్యాస్టింగ్ కి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం టాక్ వినిపిస్తుంది.

అలాగే సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉందో కూడా చెప్పే అవకాశం ఉంది.

#Hombale Films #Darling Prabhas #Hero Yash #KGF 2 #Prasanth Neel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు