సాధారణంగా కొందరి ముక్కుపై నల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి.ఈ మచ్చలు ముఖ కాంతిని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.
ఈ నేపథ్యంలోనే ఆ నల్లటి మచ్చలను వదిలించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.ఎంతో ఖర్చు పెట్టి క్రీములు కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే న్యాచురల్గానూ ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.అదెలాగో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అర స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముక్కుపై అప్లై చేసి.పది హేను నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.ఆ తర్వాత వేళ్లతో మెల్ల మెల్లగా రుద్దుకుంటూ గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా నల్ల మచ్చలు తగ్గు ముఖం పట్టి ముక్కు మృదువగా, కాంతి వంతంగా మారుతుంది.
అలాగే ఒక గిన్నెలో ఒక స్పూన్ ఓట్స్ పొడి, ఒక స్పూన్ టమోటో రసం, రెండు స్పూన్ల పుల్లటి మజ్జిగ వేసుకుని కలుపు కోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముక్కపై పూసి.పది లేదా ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.అనంతరం చల్లటి నీటితో శుభ్రంగా వాష్ చేసుకుని.అప్లై మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.
ఇలా రెగ్యులర్గా చేసినా మచ్చలు పోతాయి.

ఇక ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్, ఒక స్పూన్ నిమ్మ రసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముక్కుపై అప్లై చేసుకుని.పావు గంట లేదా ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం గోరు వెచ్చని నీటిని ఉపయోగించి వాష్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేసినా నల్లటి మచ్చలు క్రమంగా తగ్గి పోతాయి.
ముక్కు అందంగా, ప్రకాశంతంగా మారుతుంది.