మెడ నలుపును మాయం చేసే పాక్స్

వాతావరణ కాలుష్యం, ఎండ, సరైన పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో చర్మం నల్లగా మారుతుంది.ముఖ్యంగా ముఖం,మెడ భాగంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.

 Dark Neck Home Remedies-TeluguStop.com

ఈ పరిస్థితిని ఫిగ్మింటేషన్ అని అంటారు.ఈ సమస్య వస్తే ఒక పట్టాన తగ్గదు.

ఇప్పుడు ముఖ్యంగా మెడ నలుపును తగ్గించుకోవటానికి సహజసిద్ధమైన పాక్స్ గురించి తెలుసుకుందాం.ఈ పాక్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

గందం పొడిలో విటమిన్స్, న్యూట్రీషియన్స్ సమృద్ధిగా ఉండుట వలన మెడ నలుపును తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.గందం పొడిలో నీటిని కలిపి నలుపు ఉన్న ప్రాంతంలో రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

కొబ్బరిపాలు మెడ నలుపును తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.కొబ్బరిపాలలో కాటన్ ముంచి మెడ నల్లని భాగంలో రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

బియ్యంపిండిలో చర్మాన్ని తెల్లగా మార్చే గుణాలు అధికంగా ఉన్నాయి.బియ్యంపిండిలో డిస్టల్డ్ వాటర్ పోసి పేస్ట్ గా చేయాలి.ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి 15 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడి తొందరగా మెడ నలుపు తొలగిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube