మీగ‌డ‌తో ఇలా చేస్తే కోమ‌ల‌మైన గులాబీ రేకుల వంటి పెదాలు మీసొంతం!

కోమ‌ల‌మైన గులాబీ రేకుల వంటి పెదాలు కావాల‌ని అంద‌రూ కోరుకుంటారు.కానీ, మృత క‌ణాలు, ఆహార‌పు అల‌వాట్లు, ఎండ ప్ర‌భావం, శ‌రీర వేడి, ధూమపానం, పోష‌కాల లోపం, తేమ లేక‌పోవ‌డం, పెదవుల‌ సంరక్షణ లేక పోవడం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే లిప్ స్టిక్స్ వాడ‌కం ఇలా ర‌క ర‌కాల కార‌ణాల వ‌ల్ల పెదాలు న‌ల్ల‌గా, కాంతిహీనంగా మారిపోతుంటాయి.

 Dark Lips Turn To Soft And Pink Lips With Milk Cream! Dark Lips, Soft And Pink L-TeluguStop.com

దాంతో పెదాల‌ను మళ్లీ అందంగా మరియు గులాబీ రంగులోకి ఎలా మార్చుకోవాలో తెలియ‌క నానా తిప్ప‌లు ప‌డుతుంటారు.

అయితే నల్లగా ఉన్న పెదాల‌ను గులాబీ రంగులోకి మార్చ‌డంలో పాల మీగ‌డ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి పాల మీగ‌డ‌ను పెదాల‌కు ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పాల మీగ‌డ మ‌రియు బ్రౌన్ షుగ‌ర్ వేసి క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పెదాల‌కు అప్లై చేసి.ఒకటి, రెండు నిమిషాల పాటు వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకోవాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో పెదాల‌ను క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే.పెదాలు కోమ‌లంగా మ‌రియు గులాబీ రంగులోకి మార‌తాయి.

Telugu Tips, Dark Lips, Lips, Latest, Lip Care, Milk Cream, Soft Lips-Latest New

ఒక బౌల్‌లో పాల మీగ‌డ‌ తీసుకుని అందులో బీట్ రూట్ పేస్ట్ తీసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పెదాల‌కు అప్లై చేసి.ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటిలో పెదాల‌కు క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేసినా కోమ‌ల‌మైన గులాబీ రేకుల వంటి పెదాలు మీసొంతం అవుతాయి.

ఇక ఒక బౌల్‌లో పాల మీగ‌డ మ‌రియు ట‌మాటా గుజ్జు వేసుకుని క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పెదాల‌కు అప్లై చేసి బాగా రుద్దుకోవాలి.ప‌ది నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube