డార్క్ స‌ర్కిల్స్‌ను నివారించే డార్క్ చాక్లెట్‌..ఎలాగంటే?

అధిక ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, నిద్ర లేమి, కంప్యూట్స్‌ ముందు గంట‌లు త‌ర‌బ‌డి వ‌ర్క్‌ చేయ‌డం, డీహైడ్రేష‌న్ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల క‌ళ్ల చుట్టు డార్క్ స‌ర్కిల్స్ ఏర్ప‌డ‌తాయి.ఇవి చూసేందుకు అస‌హ్యంగా ఉండ‌ట‌మే కాదు.

 Dark Chocolate Helps To Reduce Dark Circles-TeluguStop.com

అందాన్ని కూడా తీవ్రంగా దెబ్బ తీస్తాయి.అందుకే ఈ డార్క్ స‌ర్కిల్స్‌ను నివారించుకునేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య్న‌త్నాలు చేస్తుంటారు.

అయితే డార్క్ స‌ర్కిల్స్‌కు చెక్ పెట్ట‌డంలో డార్క్ చాక్లెట్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి డార్క్ చాక్లెట్‌ను ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 Dark Chocolate Helps To Reduce Dark Circles-డార్క్ స‌ర్కిల్స్‌ను నివారించే డార్క్ చాక్లెట్‌..ఎలాగంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముందుగా డార్క్ చాక్లెట్ తీసుకుని క‌రిగించాలి.ఇప్పుడు అందులో కొద్దిగా పెర‌స పిండి మ‌ర‌యు రెండు, మూడు చుక్క‌ల బాదం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని క‌ళ్ల చుట్టు అప్లై చేసి.ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే క్ర‌మంగా డార్క్ స‌ర్కిల్స్ దూరం అవుతాయి.

అలాగే డార్క్ చాక్లెట్‌ను వేడి చేసి క‌రిగించుకోవాలి.ఇప్పుడు ఇందులో కొద్దిగా స్వ‌చ్ఛ‌మైన తేనె వేసి క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని డార్క్ స‌ర్కిర్స్‌పై పూసి.పావు గంట పాటు వ‌దిలేయాలి.ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో వాష్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేసినా క‌ళ్ల చుట్టు ఏర్ప‌డిన న‌ల్ల‌టి వ‌ల‌యాలు మ‌టు మాయం అవుతాయి.

ఒక బౌల్ తీసుకుని అందులో క‌రిగిన డార్క్ చాక్లెట్ మ‌రియు రెండు చుక్క‌ల లావెండర్‌ నూనె వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు దీనిని క‌ళ్ల చుట్టు వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా అప్లై చేసి.

ప‌ది నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

#BenefitsOf #ReduceDark #Skin Care #Beauty Tips #Dark Circles

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు