కొత్త కోడ‌లు ఇంట్లోకి అడుగుపెట్ట‌గానే... అగ్నిప్ర‌మాదం.! అప్పుడే కోడ‌లి ధైర్య‌స‌హాసాలు తెలిసింది.! రియ‌ల్ స్టోరి.!

ఆ రోజు నా కొడుకు సుల్తానాను ఇంటికి తీసుకొచ్చాడు.దాంతో ఇంట్లో అంద‌రికీ కోపం వ‌చ్చింది.

 Daring Women Real Story-TeluguStop.com

సుల్తానాను ఇంటి కోడ‌లిగా అంగీక‌రించేందుకు ఎవ‌రూ ఒప్పుకోలేదు.అప్పుడు నేను ఆమె ముఖం చూశా.

అమాయ‌కురాలిలా మాత్రం క‌నిపించ‌లేదు.కానీ.

ప‌రిపూర్ణ‌త సాధించిన‌, ధైర్య‌వంతురాలైన వ్యక్తిగా ఆమె నాకు క‌నిపించింది.దుర‌దృష్ట‌వ‌శాత్తూ సుల్తానా వచ్చిన రోజే మా ఇంట్లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది.

అంద‌రూ ఆమె అడుగు పెట్ట‌డం వ‌ల్లే ఇదంతా జరిగింద‌ని అన్నారు.కానీ.

నాకు అలా అనిపించ‌లేదు.ఎందుకంటే.

ఇంట్లో మంట‌లు అంటుకోగానే ఆమె వెంట‌నే ఇసుక‌ను తెచ్చి మంట‌ల‌ను ఆర్పింది.త‌న చేతులు కాలిపోతున్నా ఇంటిని కాపాడాల‌ని ఆమె చేసిన ప్ర‌య‌త్నం న‌న్ను ఆలోచింప‌జేసింది.

అందుకే ఇంట్లో అంద‌రికీ చెప్పా.మంట‌లంటుకోవ‌డం ఆమె త‌ప్పేం కాద‌ని, ఆమెను నిందించాల్సిన ప‌నిలేదని అన్నా.

అయినా అంద‌రూ వినిపించుకోలేదు.కానీ సుల్తానా మాత్రం నా మ‌న‌స్సును గెలుచుకుంది.

నా హృద‌యంలో స్థానం సంపాదించింది.

సుల్తానా పేద కుటుంబం నుంచి వ‌చ్చింది.ఆమె కొంచెం న‌ల్ల‌గా ఉంటుంది.అందుకే ఆమె త‌న‌కు న‌చ్చ‌లేద‌ని నా భ‌ర్త చెప్పాడు.

అప్పుడు నేను కూడా పేద కుటుంబం నుంచే క‌దా వ‌చ్చింది, నేను కూడా న‌ల్ల‌గానే ఉన్నా క‌దా.అని నా భ‌ర్త‌కు చెప్పా.అయినా ఆయ‌నకు మాత్రం సుల్తానా అంటే అయిష్ట‌తే ఉండేది.అలా కుటుంబ ప‌రిస్థితులు ఉండ‌గా.

చూస్తుండ‌గానే 3 ఏళ్లు గ‌డిచిపోయాయి.కానీ సుల్తానాకు మాత్రం సంతానం క‌ల‌గ‌లేదు.

అలాంట‌ప్పుడు ప్ర‌తి కుటుంబంలోనూ ప‌రిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు.అలాంటి ప‌రిస్థితే మా కుటుంబంలోనూ ఏర్ప‌డింది.

సుల్తానాను ఇంటికి పంపాల‌ని అంద‌రూ నిర్ణ‌యించుకున్నారు.

ఇంట్లో అంద‌రి అభిప్రాయం తెలిసేస‌రికి పాపం సుల్తానాకు ఏం చేయాలో తెలియ‌లేదు.

త‌న‌ను ఇంట్లో నుంచి గెంటేస్తార‌ని భ‌య‌ప‌డింది.ఎవ‌రితోనూ మాట్లాడేది కాదు.

అస‌లు త‌ను మాట్లాడ‌డ‌మే మానేసింది.ఒక రోజు నేనే చొరవ తీసుకుని బంధువుల ఇంటికి వెళ్తున్నామ‌ని ఇంట్లో అబద్ధం చెప్పి స‌మీపంలో ఉన్న హాస్పిట‌ల్‌కు సుల్తానాను తీసుకువెళ్లా.

అక్క‌డ ప‌రీక్ష‌లు చేశారు.మందులు ఇచ్చారు.6 నెల‌లు వాడేస‌రికి సుల్తానా గ‌ర్భ‌వ‌తి అయింది.అప్పుడామె క‌ళ్ల‌ల్లో క‌నిపించిన ఆనందాన్ని వ‌ర్ణించ‌డానికి నిజంగా మాట‌లు రాలేదు.

అలా మా ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న బంధం ఇంకా బ‌ల‌ప‌డింది.పేరుకు అత్తా కోడ‌ళ్ల‌మైనా త‌ల్లీ బిడ్డ‌ల్లా ఉండేవాళ్లం.

ఇంకా చెప్పాలంటే.ఆమే నాకు త‌ల్లిగా వ్య‌వ‌హ‌రించేది.

ఆ భావ‌న నాలో ఉండేది.

9 నెల‌లు నిండే స‌రికి సుల్తానా పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.నాకు మ‌న‌వ‌డు క‌లిగే స‌రికి నా ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.రోజూ వాడితో ఆడుకోవ‌డ‌మే స‌రిపోయేది.

అలా కొన్ని నెల‌లు గడిచాక సుల్తానా నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి త‌న‌కు ద‌గ్గ‌ర్లో ఉన్న ఓ గార్మెంట్ ఫ్యాక్ట‌రీలో ఉద్యోగం వ‌చ్చింద‌ని, రోజూ ప‌నికి వెళ్లి వ‌స్తాన‌ని చెప్పింది.న‌న్ను ప‌ని మానేయ‌మ‌ని చెప్పింది.

ఆమె చెప్పిన మాటలు విన్నాక మొద‌ట ఆశ్చ‌ర్యపోయా.అయినా తేరుకుని స‌రే న‌న్నా.ఇక రోజూ నేను పనిచేయాల్సిన అవ‌స‌రం లేదు.40 సంవ‌త్సరాలుగా చేస్తున్న ప‌నికి ఫుల్‌స్టాప్ పెట్టా.ఇక నిత్యం నా మ‌న‌వ‌డితో ఆడుకోవ‌డ‌మే నా ప‌ని.నిజ‌మే నాకీ విశ్రాంతి అవ‌స‌ర‌మే.నన్ను కూతురిలా చూసుకునే నా కోడ‌లు ఉన్నంత వ‌రకు నేను విశ్రాంతిలోనే స‌మ‌యం గడుపుతా.నా చిన్ని మ‌న‌వ‌డిని ఆడిస్తూ.

వాడి ముద్దు ముద్దు చేష్ట‌లు చూస్తూ.అలా కాలం గ‌డిస్తే చాలు.

అంత‌కన్నా కావ‌ల్సింది ఏముంది.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube