దర్బార్ 11 రోజుల కలెక్షన్స్.. ఎంతో తెలుసా?  

Darbar 11 Days Telugu Version Collections-darbar,darbar Collections,nayanthara,rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ దర్బార్ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కాప్ డ్రామాలో రజినీకాంత్ ఓ పోలీసాఫీసర్ పాత్రలో నటించారు.

Darbar 11 Days Telugu Version Collections-Darbar Darbar Collections Nayanthara Rajinikanth

ఈ సినిమాతో రజినీకాంత్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.

తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మాస్ వర్గాలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.అయితే తెలుగులో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో లాంటి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కావడంతో దర్బార్ సినిమా వసూళ్లపై ప్రభావం చూపించాయి.

అయితే రజినీకి ఉన్న ఫాలోయింగ్‌తో దర్బార్ సినిమా 11 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.9.89 కోట్లు వసూళ్లు సాధించింది.ఏరియాల వారీగా ఈ చిత్ర 11 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 4.99 కోట్లు

సీడెడ్ – 1.06 కోట్లు

గుంటూరు – 0.71 కోట్లు

వైజాగ్ – 1.07 కోట్లు

ఈస్ట్ – 0.65 కోట్లు

వెస్ట్ – 0.45 కోట్లు

నెల్లూరు – 0.40 కోట్లు

కృష్ణా – 0.56 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 9.89 కోట్లు

తాజా వార్తలు

Darbar 11 Days Telugu Version Collections-darbar,darbar Collections,nayanthara,rajinikanth Related....