ధనుష్‌ మరీ అంత చిల్లరగా వ్యవహరిస్తున్నాడా?   Danush Submited Duplicate Certificate Againest To The Kadhiresan     2018-10-28   08:19:35  IST  Ramesh P

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ తల్లిదండ్రులు ఎవరు అనే విషయం తాజాగా మరో మలుపు తిరిగింది. గతడాది మేలూరుకు చెందిన కదిరేశన్‌, మీనాక్షి దంపతులు ధనుష్‌ తమ కుమారుడేనని, చిన్నప్పుడే ఇంట్లో నుండి పారిపోయి వచ్చాడని, ఇప్పుడు హీరోగా చేస్తున్నాడని మేలూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు అనేక మలుపులు తిరిగి చివరకు మద్రాసు కోర్టుకు చేరింది.

ధనుష్‌ తమ కుమారుడు కాబట్టి నెలకు కొంత మొత్తంలో తమకు చెల్లించేలా న్యాయం చేయాలంటూ కదిరేశన్‌ దంపతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ధనుష్‌ తల్లిదండ్రుల విషయమై బర్త్‌ సర్టిఫికెట్‌, స్టడి సర్టిఫికెట్‌ చూపించాల్సిందిగా కోరింది. కోర్టు అడిగినట్టుగానే ధనుష్‌ సదరు పత్రాలను కోర్టులో సమర్పించాడు. కాగా కోర్టును గతేడాది ఈ కేసును కొట్టివేసింది.

Danush Submited Duplicate Certificate Againest To The Kadhiresan-

తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగినట్టు సమాచారం. ధనుష్‌ చూపిన పత్రాలన్నీ కూడా నకిలివే అని, ఈ విషయమై ధనుష్‌పై క్రిమినల్‌ కేసు బుక్‌ చేయాలని కదిరేశన్‌ దంపతులు తాజాగా కోర్టును ఆశ్రయించినట్టుగా సమాచారం. ధనుష్‌ మరీ ఇంత చిల్లరగా నకిలి సర్టిఫికెట్‌లను కోర్టులో సమర్పిస్తాడా అని తమిళ పరిశ్రమలో ధనుష్‌పై భిన్నాభిప్రాయాలు నెలకొంటున్నాయి. నవంబర్‌ 7న ఈ కేసు విచారణకు రానుంది. ఒకవేళ ధనుష్‌ చూపిన పత్రాలు నకిలివే అయితే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? ధనుష్‌ కెరియర్‌కు ఏమైనా సమస్య వస్తుందా అని సన్నిహితులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.